రాష్ట్రీయం

రుణమాఫీ వివరాలు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 13: రైతులకు వ్యవసాయ రుణ మాఫీ వివరాలు అందజేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను హైదరాబాద్ హైకోర్టు ఆదేశించింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం శాఖమూరు గ్రామానికి చెందిన కొల్లి శివరామరెడ్డి అనే రైతు, నల్లగొండ జిల్లాకు చెందిన వ్యవసాయ జన చైతన్య సమితికి చందిన డి.నర్సింహారెడ్డి రుణమాఫీపై వేరు వేరుగా హైకోర్టులో ఈ అంశంపై పిటిషన్ దాఖలు చేశారు.
ఏపి, తెలంగాణల్లో ఎందరు రైతులను రుణమాఫీ కింద ఎంపిక చేశారు, ఎంత మందికి ఇప్పటి వరకు ప్రయోజనం కలిగిందో వివరాలు అందజేయాలని ఇరు రాష్ట్రాలను కోర్టు ఆదేశించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్, జస్టిస్ రజనీలతో కూడిన బెంచ్ ఈ పిటీషన్‌ను విచారించింది. ఇరు రాష్ట్రాలు రుణమాఫీకి సంబంధించి వివరాలు అందజేయాలని బెంచ్ ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీపై ఆగస్టు 13, 2014న జివో విడుదల చేసిందన్నారు. వన్‌టైం సెటిల్‌మెంట్ అని జివోలో పేర్కొన్న లక్ష రూపాయల మాఫీని నాలుగు విడతలుగా ఇచ్చారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాయిదాల పద్ధతిలో ఇవ్వడం వల్ల ఒక్క రైతు కూడా ఈ పథకం వల్ల ప్రయోజనం పొందలేదని తెలిపారు. ఇప్పటికీ కొన్ని బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని, వడ్డీ బకాయిలు కూడా చెల్లించలేదని తెలిపారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది శరత్‌కుమార్‌ను కోర్టు జివో ఇంకా అమలులో ఉందా? అని అడిగింది. నాలుగు వాయిదాల్లో మొత్తం 17వేల కోట్ల రూపాయల రుణమాఫీని అమలు చేసినట్టు ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు.