రాష్ట్రీయం

మసిపూసి మారేడుకాయ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 18: రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన విశాఖ భూ కుంభకోణాన్ని మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 20 వేల కోట్ల ల్యాండ్ స్కామ్ జరిగిందని జిల్లా ఉన్నతాధికారులు ఇచ్చిన ప్రాథమిక నివేదిక, లక్ష ఎకరాల కబ్జా లేదా, సంబంధిత రికార్డుల టాంపరింగ్, లేదా రికార్డులు మాయమయ్యాయని అధికారులు చెప్పిన లెక్కలు, ఇందులో ప్రభుత్వ పెద్దలే ఉన్నారని ఇదే ప్రభుత్వంలోని సీనియర్ మంత్రి ప్రకటించిన సంగతి జనం మరిచిపోలేదు. ఈ భూకుంభకోణ ఊబి నుంచి బయట పడేందుకు ప్రభుత్వం ఎదుట ఉన్న మార్గాలు దాదాపూ మూసుకుపోయాయి. భూ కుంభకోణాలపై జిల్లా మంత్రులు విభిన్న ప్రకటనలు చేయడాన్ని మాత్రమే చంద్రబాబు నాయుడు పరిగణలోకి తీసుకుని, పార్టీ ప్రతిష్ఠ దెబ్బతినకుండా ఉండే చర్యలకు ఉపక్రమించారు. విశాఖలో జరిగిన భూ దందా ఆషామాషీది కాదు. ఇందులో ప్రభుత్వ పెద్దలు, వారి బంధువులు ఉన్నారని జనం భావిస్తున్నా, ఈ ల్యాండ్ స్కామ్‌పై సిఐడి లేదా సిబిఐ విచారణకు ఆదేశించకుండా, సిట్ వేసి ప్రభుత్వం చేతులు దులుపుకొంది. ఈ కుంభకోణంలో రెవెన్యూ, పోలీస్ శాఖలు చాలా వరకూ ఇరుక్కున్నాయి. భూ కుంభకోణ తీవ్రతను తగ్గించి చూపించేందుకు ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. కేవలం 255 ఎకరాల భూముల విషయంలో మాత్రమే అవకతవకలు జరిగాయని చెబుతోంది. రేపు సిట్ దర్యాప్తు చేసినా, ఈ సంఖ్యకు అంతో, ఇంతో కలిపి నివేదిక ఇస్తుందే తప్ప, కొత్తగా ఏం చెప్పడానికి వీల్లేదు. జిల్లాలో లక్ష ఎకరాల భూమికి సంబంధించి అక్రమాలు జరిగాయని సాక్షాత్తూ కలెక్టరే చెపితే, ఆయన స్టేట్‌మెంట్‌ను పక్కన పెట్టి, కొత్తగా దర్యాప్తు జరిపించడం వెనుక ఆంతర్యం ఏంటి? ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ ల్యాండ్ స్కామ్‌లకు సంబంధించి నగరంలో ఇప్పటికే 14 కేసులు నమోదైతే, కేవలం మూడు కేసులు మాత్రమే నమోదైనట్టు చెబుతున్నారు.
రికార్డుల మాయం స్కాంలో భాగం కాదా?
విశాఖలో ల్యాండ్ రికార్డులు పెద్దఎత్తున మాయం అయ్యాయి. 2,45,896 ఫీల్డ్ మెజర్‌మెంట్ బుక్స్(ఎఫ్‌ఎంబిలు) ఉంటే, వీటిలో 16,735 ఎఫ్‌ఎంబిలు కనిపించకుండా పోయాయని కలెక్టర్ స్వయంగా చెప్పడం గమనార్హం. 3,022 రీ సర్వే సెటిల్‌మెంట్ రిజిస్టర్లలో (ఆర్‌ఎస్‌ఆర్)లలో 379 రిజిస్టర్లు కనిపించడం లేదు. 3,022 గ్రామాల క్లియర్ మ్యాపులలో 233 గ్రామాల మ్యాపులు మాయమైపోయాయి. ఇందులో భీమిలి, మధురవాడ ప్రాంతాలకు చెందినవే కావడం గమనార్హం. దీనికి సంబంధించి ఎవరు సమాధానం చెబుతారు? రికార్డుల మాయమై చాలా కాలమే అయినా, బాధ్యులపై కనీస చర్యలు కూడా ఇప్పటి వరకూ చేపట్టలేదు.
ముదపాక కుంభకోణం కాదా?
ముదపాకలో 1000 ఎకరాల విలువైన భూమిని చేజిక్కించుకునేందుకు ప్రైవేటు వ్యక్తులు రంగం సిద్ధం చేసుకున్నారు. మొదటి విడతగా 300 ఎకరాల భూమిని ఎకరా 10 లక్షల చొప్పన కొనుగోలు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. డి పట్టా భూములను కొనుగోలు చేసే అధికారం వారికి ఎవరు ఇచ్చారు. వారు కొన్న వెంటనే భూ సమీకరణ జిఓ జారీ చేయడం వెనుక ఆంతర్యం ఏంటి? సిబిఐ దర్యాప్తుతోనే ఇందులో లొసుగులు వెలుగు చూస్తాయి. ముదపాక భూముల విషయాన్ని అసలు ప్రభుత్వం ప్రస్తావనకే తీసుకురాకపోవడానికి కారణం ఏంటి?
కేవలం సిట్ వేసి, చేతులు దులుపుకోవడం వలన ప్రభుత్వంపై దాడి చేయడానికి విపక్షాలు మరిన్ని ఆయుధాలు ఇచ్చినట్టయింది.
విశాఖ భూ కుంభకోణంపై ఈనెల 22న జగన్ విశాఖలో మహా ధర్నా నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కుంభకోణంపై కొత్త వ్యూహాన్ని అనుసరించకపోతే ఇబ్బందులు తప్పవు.