రాష్ట్రీయం

ఆనవాళ్లే మిగిలాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/చేవెళ్ల/షాబాద్, జూన్ 25: బోరుబావిలో పడిన చిన్నారి మీనా మృతి చెందింది. విషాదాంతంగా మారిన చిన్నారి మీనా శరీరావయవాలు విడివిడిగా బయటకు రావటం అందరినీ కలచివేసింది. పాప అవయవాలకు ఆదివారం చేవెళ్ల ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈనెల 22న సాయంత్రం చిన్నారి మీనా ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిన విషయం తెలిసిందే. చిన్నారిని కాపాడేందుకు అధికార యంత్రాంగం 60 గంటలు శ్రమించినా ఫలితం లేకుండాపోయింది. 400 అడుగుల లోతులో బాలిక ఇరుక్కుపోయిందని సహాయక బృందాలు గుర్తించాయి. అనంతరం
ఫ్లష్ ఔట్ (ఎయిర్ లిఫ్ట్) ద్వారా నీటిని బయటకు తీస్తున్న సందర్భంలో చిన్నారి అవయవాలు, ఫ్రాక్ బయటికి వచ్చాయి. మూడు రోజులుగా నిరంతరంగా అధికార యంత్రాంగం శక్తివంచన లేకుండా సహయక చర్యలు తీసుకున్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం కలుగలేదు. అధునూతన మాట్రిక్స్ కెమెరాల ఆధారంగా పాపను ప్రాణాలతో బయటకు తెచ్చేందుకు పడిన ప్రయాస వృథా అయింది. అనేక రకాలుగా రెస్క్యూ టీంలు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు.
చిన్నారిని కాపాడలేకపోయాం..కుటుంబాన్ని ఆదుకుంటాం
బోరుబావిలోపడి ప్రాణాలు కోల్పోయిన చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి మహేందర్‌రెడ్డి హామీ ఇచ్చారు. అదేవిధంగా చిన్నారి ప్రాణాలు కాపాడలేకపోయామని రంగారెడ్డిజిల్లా కలెక్టర్ రఘునందన్‌రావుఅన్నారు. ప్రభుత్వపరంగా చిన్నారి కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు.

చిత్రం.. పాపను ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం స్వగ్రామానికి తరలిస్తున్న దృశ్యం