రాష్ట్రీయం

జూలై 3 నుండి నీట్ అడ్మిషన్ల ప్రక్రియ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: దేశవ్యాప్తంగా నీట్ ర్యాంకు ఆధారంగా ఎంబిబిఎస్, బిడిఎస్ కాలేజీల్లో కన్వీనర్ కోటాకు వచ్చే నెల 3వ తేదీ నుండి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. జూలై 3 నుండి జూలై 11 వరకూ రిజిస్ట్రేషన్ ఉంటుంది. తనకు కావల్సిన కాలేజీల ఛాయిస్ ఫిల్లింగ్‌కు జూలై 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ అవకాశం ఇస్తారు. సీట్ల కేటాయింపు తొలి రౌండ్ ప్రాసెస్ జూలై 13, 14 తేదీల్లో పూర్తి చేసి కాలేజీల కేటాయింపును జూలై 15న ప్రకటిస్తారు. సీట్లు పొందిన వారు జూలై 16 నుండి జూలై 22 వరకూ ఆయా కాలేజీలకు వెళ్లి రిపోర్టు చేయాల్సి ఉంటుంది. రెండోదశ ఆప్షన్లను ఆగస్టు 1వ తేదీ నుండి 4వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకూ ఇవ్వాల్సి ఉంటుంది. రెండో దశ సీట్ల ప్రాసెస్‌ను ఆగస్టు 5 నుండి 7వ తేదీ వరకూ పూర్తి చేసి, కేటాయింపులను ఆగస్టు 8న ప్రకటిస్తారు. రెండోదశలో సీట్లు పొందిన వారు ఆగస్టు 9 నుండి 16వ తేదీ మధ్యలో ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 16వ తేదీ తర్వాత మిగిలి పోయిన సీట్లను సిబిఎస్‌ఇ ఆయా రాష్ట్రాలకు అప్పగిస్తుంది. వాటిని ఆయా రాష్ట్రాలు మెరిట్ ప్రాతిపదికపై భర్తీ చేసుకోవడం లేదా ఆయా కాలేజీల యాజమాన్యాలకు అప్పగిస్తే స్పాట్ అడ్మిషన్లు నిర్వహించుకునే వీలుంది. అయితే ఈ మిగులు సీట్ల వ్యవహారంపై తెలంగాణ, ఆంధ్రాల్లో ఇంకా స్పష్టత రాలేదు. ఈసారి నీట్‌కు 11,38,890 మంది రిజిస్టర్ చేసుకోగా, 10,90,085 మంది పరీక్షకు హాజరయ్యారు. తెలుగు మాద్యమంలో పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు. 1766 మాత్రమే కావడం గమనార్హం. వారిలో 6,11,539 మంది అర్హత సాధించారు. ఇందులో ఇతరులు 5,43,473 మంది కాగా, ఒబిసి 47,382 మంది, ఎస్సీలు 14,599 మంది, ఎస్టీలు 6018 మంది, పిహెచ్ 67 మంది, ఒబిసి పిహెచ్ 152 మంది, ఎస్సీ పిహెచ్ 38 మంది, ఎస్టీ పిహెచ్ 10 మంది ఉన్నారు. వారిలో 2,66,221 మంది అబ్బాయిలు, 3,45,313 మంది అమ్మాయిలు ఉన్నారు. దేశవ్యాప్తంగా 470 మెడికల్ కాలేజీల్లో 65,170 సీట్లు, 308 డెంటల్ కాలేజీల్లో 25,730 సీట్లు ఉన్నాయి. తొలి పాతిక ర్యాంకుల్లో ఇద్దరు మాత్రమే తెలంగాణ విద్యార్ధులున్నారు. 12వ ర్యాంకర్ లక్కింశెట్టి అర్నవ్ త్రినాధ్, 24వ ర్యాంకర్ మంగాని దీపిక ఉన్నారు.