రాష్ట్రీయం

గోదావరికి జలకళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 27: తెలంగాణలో గోదావరి కళకళలాడుతోంది. ఐదారు జిల్లాలకు జీవధారగా ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు గోదావరి వరద నీరు చేరుతోంది. గత ఐదేళ్లలో జూన్ నెలలోనే పెద్దఎత్తున వరద నీరు చేరడం ఈ ఏడాదే. ఇదిలావుంటే కృష్ణా బేసిన్‌లో నీటి నిల్వలు అడుగంటాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు వెలవెలబోతున్నాయి. జూలై, ఆగస్టు నెలల్లో కురిసే వర్షాలపై రెండు జలాశయాల భవిత ఆధారపడి ఉంది. మహారాష్టల్రో భారీ వర్షాల వల్ల శ్రీరాంసాగర్‌కు గోదావరి వరద నీరు వస్తున్నట్లు సాగునీటి ఇంజనీర్లు తెలిపారు. 2500 క్యూసెక్కుల నీరు వస్తోంది. సాధారణంగా జూలై లేదా ఆగస్టు నెలల్లో గోదావరికి వరద ప్రవాహం ఉంటుంది. కానీ మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల జూన్‌లోనే నీరు వస్తోంది. దీంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి మట్టం 1091 అడుగులకు 1055 అడుగులకు చేరింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలాశయం కళకళలాడితే కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో వచ్చే ఖరీఫ్‌కు నీటి కొరత ఉండదు. తెలంగాణలో గోదావరి నిర్మల్ జిల్లా బాసరలో ప్రవేశిస్తుంది. నిర్మల్, మంచిర్యాల్, నిజామాబాద్, జగిత్యాల్, పెద్దపల్లి, రామగుండం జిల్లాల ద్వారా ప్రవహిస్తుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుతో పాటు సింగూర్, నిజాంసాగర్, కడెం, యల్లంపల్లి రిజర్వాయర్లకు క్రమేపి నీటి మట్టం పెరుగుతోంది. ఎస్‌ఆర్‌ఎస్‌పి కెపాసిటీ 90 టిఎంసి. దీని పరిధిలో కాకతీయ కెనాల్, సరస్వతి కెనాల్, ఫ్లడ్‌ఫ్లో కాల్వలకు నీరు అందుతుంది. ఈ ఖరీఫ్ సీజన్‌లో సింగూర్, ఘన్‌పూర్, కడెం, నెల్వాయి, గొల్లవాగు ప్రాజెక్టుల ద్వారా 12 లక్షల ఎకరాలకు సాగునీటిని ఇవ్వాలని ప్రభుత్వం ప్రణాళికను ఇప్పటికే ఖరారు చేసింది. గోదావరి నది కింద ఉన్న ఆయకట్టు కింద నిధులను విడుదల చేసి 10 నుంచి 22 లక్షల ఎకరాలకు సాగునీటి స్ధిరీకరణ చేసినట్లు సాగునీటి ఇంజనీర్లు చెప్పారు.
కృష్ణా నీటి వినియోగంపై 17న భేటీ
కృష్ణా జలాల వినియోగంపై జూలై 17న ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసేందుకు కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ సన్నాహాలు చేస్తోంది. కృష్ణా నీటి వినియోగంపై ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర జలవనరుల శాఖ నియమించిన కమిటీ నివేదికను వచ్చే అక్టోబర్‌లో ఇవ్వనుంది. 2015లో ఖరారు చేసిన నీటి వినియోగం విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ కోరుతోంది. కాని ఆంధ్ర ఈ విధానాన్ని వ్యతిరేకిస్తోంది. పట్టి సీమ ఎత్తిపోతల ద్వారా 50 టిఎంసి నీటిని కృష్ణా డెల్టాలోకి ఆంధ్ర ప్రభుత్వం మళ్లిస్తోంది. ఆమేరకు కృష్ణా నదిలో ఎగువున ఉన్న తెలంగాణ తమకు నీటి వినియోగం పెంచాలని కోరుతోంది. దీనిని ఆంధ్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. కృష్ణా బోర్డు పరిధి నిర్ణయించాలని, అధికారాలు ఇవ్వాలని ఆంధ్ర ప్రభుత్వం కేంద్రంపై వత్తిడి తెస్తోంది. నాగార్జునసాగర్ నుంచి కృష్ణా డెల్టాకు, కుడి కాల్వకు తగిన విధంగా నీటిని విడుదల చేయడం లేదని ఏపి ప్రభుత్వం కేంద్రం దృష్టికి పలుసార్లు తీసుకెళ్లింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులతో పాటు కృష్ణా నదిపై ఉన్న అన్ని ప్రాజెక్టులను బోర్టు పరిధిలోకి తేవాలని ఆంధ్రప్రభుత్వం మొదటి నుంచి కేంద్రాన్ని కోరుతోంది.