రాష్ట్రీయం

100 గజాలలోపు ఉచితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 17: రాష్ట్రంలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ స్థలాలను మార్కెట్ ధర ఆధారంగా క్రమబద్ధీకరించేందుకు మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. అయితే దారిద్య్ర రేఖకు దిగువునున్న కుటుంబాలకు మాత్రం 100 గజాలలోపు స్థలాన్ని ఉచితంగా క్రమబద్ధీకరిస్తారు. తరువాత గ్రామాల్లో అయితే మార్కెట్ ధరలో 30 శాతం, పట్టణాల్లో 15 శాతం వసూలు చేసేందుకు నిర్ణయించారు. వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) కెఇ కృష్ణమూర్తి నేతృత్వంలో ఆక్రమిత ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణపై సోమవారం సమావేశం జరిగింది. మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ పాల్గొన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో దారిద్య్ర రేఖకు దిగువునున్న వారికి 100 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరిస్తారు. 100 గజాలు పైబడిన స్థలాలకు శ్లాబ్‌ల వారీగా క్రమబద్ధీకరణ రుసుము వసూలు చేసేందుకు నిర్ణయించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వేర్వేరుగా రుసుముల శ్లాబ్‌లను ప్రతిపాదించారు. గ్రామీణ ప్రాంతాల్లో 100 గజాలలోపు దారిద్య్ర రేఖకు ఎగువునున్న కుటుంబాలకు రిజిస్ట్రేషన్ విలువలో 30శాతం వసూలు చేసేందుకు నిర్ణయించారు.
బిపిఎల్‌తో సంబంధం లేకుండా 100 నుంచి 250 గజాల వరకూ రిజిస్ట్రేషన్ విలువలో 50 శాతం, 251 గజాల నుంచి 500 గజాల వరకూ రిజిస్ట్రేషన్ విలువలో 75 శాతం వసూలు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో 100 గజాలలోపు దారిద్య్ర రేఖకు ఎగువునున్న కుటుంబాలకు రిజిస్ట్రేషన్ విలువలో 15 శాతం, 100 నుంచి 250 గజాల వరకూ రిజిస్ట్రేషన్ విలువలో 25 శాతం, 251 నుంచి 500 గజాల వరకూ 50 శాతం వసూలు చేసేందుకు నిర్ణయించారు. దీనిపై మంగళవారం జరుగనున్న మంత్రిమండలి సమావేశంలో చర్చించి, జీవో జారీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

చిత్రం.. కేబినెట్ సబ్‌కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న కె.ఇ. కృష్ణమూర్తి