రాష్ట్రీయం

జంతు సంరక్షణపై ఇంత నిర్లక్ష్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 17: జంతు సంరక్షణపై గతంలో ఇచ్చిన ఆదేశాలను తెలుగు రాష్ట్రాలూ నేటి వరకూ అమలుచేయకపోవడంపై సోమవారం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు యానిమల్స్’ల ఏర్పాటుపై ఇంత నిర్లక్ష్యం ఏమిటని, అధికార యంత్రాంగం ఇంత నిస్తేజంగా ఉంటే ఎలా అని హైకోర్టు ప్రశ్నించింది. ఈ అంశంపై సమగ్ర సమాచారంతో హైకోర్టు ముందుకు రావాలని తెలంగాణ, ఆంధ్రా ప్రభుత్వాలను ఆదేశించింది. నిర్లక్ష్యం వహిస్తే చీఫ్ సెక్రటరీ హైకోర్టుకు రావాల్సి ఉంటుందని హెచ్చరించింది. టి చంద్రశేఖర్ సహా మరొకరు దాఖలు చేసిన పిటిషన్‌లను విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ రజనీలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ వ్యాఖ్యలను చేసింది.