రాష్ట్రీయం

వెంకయ్య ఎంపికకు మద్దతివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 17: ఎన్‌డిఏ ఉపరాష్టప్రతి అభ్యర్థిగా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం పట్ల సిఎం కెసిఆర్, ఎంపి కవిత, పలువురు మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. వెంకయ్యను ఉపరాష్టప్రతి అభ్యర్థిగా ప్రకటించగానే ప్రధాని మోదీ సిఎం కెసిఆర్‌కు ఫోన్ చేసి తెలియజేశారు. వెంకయ్యనాయుడుకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఎంపి కవిత, మరో ఎంపి జితేందర్‌రెడ్డితో కలిసి ఢిల్లీలో వెంకయ్య నాయుడు నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు వెంకయ్యనాయుడుకు ఉపరాష్టప్రతి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం రావడం సంతోషకరమని ఎంపి కవిత తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. కాగా మంత్రులు హరీశ్‌రావు, కెటిఆర్, కడియం శ్రీహరి హర్షం వ్యక్తం చేశారు. వెంకయ్యనాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలకతీతంగా వెంకయ్యనాయుడుకు మద్దతు తెలిపే అవకాశం ఉంటుందని హరీశ్‌రావు పేర్కొన్నారు.

చిత్రం.. డీల్లీలో వెంకయ్యనాయుడుని కలిసి అభినందనలు తెలుపుతున్న తెరాస ఎంపీలు కవిత, వినోద్, జితేందర్‌రెడ్డి