రాష్ట్రీయం

ట్రిబ్యునల్ ఆదేశాలు అమలు చేయరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 12: ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను పాటించకపోవడంపై ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల తీరు పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నిర్ణీతకాలపరిమితిలోపల ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తామని ఆంధ్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అఫిడవిట్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎం వెంకటేశ్వరరావుతో పాటు మరో ఏడుగురు ట్రిబ్యునల్ 2014 డిసెంబర్‌లో ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం పాటించడం లేదంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సివి నాగార్జునరెడ్డి, జస్టిస్ జి శ్యాంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. పంచాయితీరాజ్‌లో నాల్గవ తరగతికి సంబంధించి ఖాళీగా ఉన్న ఉద్యోగాలు, భవిష్యత్తులో ఖాళీ అయ్యే ఉద్యోగాలను 1994 ఏప్రిల్ 22వ తేదీ జారీ అయిన జీవో 212కు లోబడి ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని ఏపిఏటి ఆదేశాలు జారీ చేసింది. మూడేళ్లు గడచినా ఇంతవరకు ప్రభుత్వం ఈ ఆదేశాలను పట్టించుకోలేదని పిటిషనర్ పేర్కొన్నారు. న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా ఉండడం చట్టానికి ఉల్లంఘించడమేనన్నారు. ట్రిబ్యునల్ ఆదేశాలను అమలు చేయకపోవడం సరైన విధానం కాదని కోర్టు పేర్కొంది. సంబంధించిన అధికారులు కోర్టుకు హాజరయ్యే విధంగా సమన్లు జారీ చేస్తామని కోర్టు పేర్కొంది. ఈ దశలో ప్రభుత్వ న్యాయవాది జోక్యం చేసుకుని ట్రిబ్యునల్ ఆదేశాలు అమలు చేసేటట్లు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఈ కేసు విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది.