రాష్ట్రీయం

భారత్‌లో సూర్యగ్రహణ ప్రభావం ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 20: శ్రావణమాసం సోమవారంతో ముగియనున్న నేపథ్యంలో 21వ తేదీన సూర్యగ్రహణం ఏర్పడుతున్నప్పటికి ఆ ప్రభావం భారతదేశంలో కనపడదని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. సూర్యగ్రహణం అసలు భారతదేశంలో కనిపించదని అంటున్నారు. యూరప్, ఉత్తర, తూర్పు ఆసియా, నార్త్ అమెరికా, దక్షిణ అమెరికా, పసిపిక్, అట్లాంటిక్, ఆర్కిటిక్‌లలో మాత్రమే సూర్యగ్రహణం కనిపిస్తుందని అంటున్నారు. అయితే తొలిసారిగా అమెరికాలో అలస్కా, హవాయ్ మినహాయించి అమెరికా మొత్తం గ్రహణ ప్రభావం ఉంటుందంటున్నారు. 1979లో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడిందని అటు తరువాత సోమవారం మరోసారి సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతోందన్నారు. భారత కాలమానం ప్రకారం ఈనెల 21వ తేదీ రాత్రి 9.16 గంటలకు సూర్యగ్రహణం ప్రారంభమై, 5.18 గంటలపాటు ఉంటుందన్నారు. అంటే 3.13 గంటలు మాత్రమే ఈగ్రహణాన్ని తిలకించే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఈక్రమంలో తిరుమల శ్రీవారి ఆలయంలో యథావిధిగా శ్రీవారి దర్శనం ఉంటుంది.