రాష్ట్రీయం

చిరస్మరణీయుడు రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: సమైక్య పాలనలో తెలంగాణ మేధావులకు అన్యాయం జరిగిందని సిఎం కె చంద్రశేఖర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్య పాలనలో తెలంగాణ వెనుకబాటుకు గురై గొప్ప నేతలను స్మరించుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రాజా బహద్దూర్ కొత్వాల్ వెంకటరామారెడ్డి జయంతి పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా బుద్వేల్‌లో మంగళవారం నిర్వహించిన రెడ్డి హాస్టల్ శతాబ్ది ఉత్సావాల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హాస్టల్ భవన సముదాయాన్ని మంత్రులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ తెలంగాణ నేతల చరిత్ర ఎవరికీ తెలియకుండా సమైక్య పాలనలో అణిచేశారన్నారు. రాజా వెంకటరామారెడ్డి చరిత్రను సురవరం ప్రతాప్‌రెడ్డి లిఖించారని, రాష్ట్రావతరణకు ముందు తెలంగాణ మహానీయుల పేర్లు ఏ ప్రభుత్వ సంస్థకూ పెట్టుకోలేదని, వాటి ప్రస్తావన తీసుకొస్తే పెద్ద పుస్తకం అవుతుందన్నారు. తెలంగాణ ఆవిర్భవించిన రెండు వారాల్లోపే అప్పా పోలీసు అకాడమీ పేరును రాజ బహద్దూర్ వెంకటరామారెడ్డి పోలీసు అకాడమీగా మారుస్తూ జీవో జారీ చేసినట్టు గుర్తు చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరును వ్యవసాయ వర్సిటీకి నామకరణం చేశామన్నారు. వెంకటరామారెడ్డి పేదవాడు కాదని, వారి పూర్వీకులు వనపర్తి సంస్థానాధీశులని చెప్పారు. కష్టపడి చదువుకొని మొదట ఒక పోలీసు అధికారిగా బాధ్యతలు చేపట్టి కొత్వాల్‌గా
మారారన్నారు. ప్రజలకు, పేదలకు మేలు చేయాలనే సంకల్పంతో చదువు చెప్పించేందుకు విద్యా సంస్థలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. పేదల అభివృద్ధికి చదువే ఉపయుక్తమని భావించి ఇతర సామాజిక వర్గాలకు తమ విద్యాలయాల్లో 30శాతం రిజర్వేషన్లు కల్పించిన మహానీయుడని కొనియాడారు. ఈ విద్యా సంస్థల్లో చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించిన ప్రతి ఒక్కరూ ఆయనకు రుణపడి ఉంటారన్నారు. ఆయన ఏర్పాటు చేసిన విద్యాలయాలు 14 విద్యా సంస్థలుగా పరిణతి చెందడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఆశయ సాధనను ముందుకు తీసుకెళ్లేలా తెరాస ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ విద్యాలయ ఏర్పాటుకు తెరాస ప్రభుత్వం 10 ఎకరాల స్థలం, రూ.10 కోట్లు కేటాయించిందని, మరో ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించడానికి జీవో సిద్ధం చేస్తున్నట్టు ప్రకటించారు. పక్కనే హాస్టల్ భవన ఏర్పాటుకు, నిర్వాహణకు మరో 1500 గజాల స్థలాన్ని కేటాయిస్తున్నామని అన్నారు. మహిళా చదువుల కోసం ప్రత్యేక పాఠశాల, కళాశాలను ఏర్పాటు చేసిన రాజా బహద్దూర్ వెంకటరామారెడ్డి సేవలు అనిర్వచనీయమని కీర్తించారు. విద్యా సంస్థలో నూతన కోర్సులు ప్రవేశపెట్టి జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చేలా నిర్వాహాకులు చర్యలు తీసుకోవాలని కోరారు. కెసిఆర్‌ను విద్యాలయం కార్యవర్గం అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, కార్యవర్గ సభ్యులు సన్మానించారు.

చిత్రం..రాజా బహద్దూర్ కొత్వాల్ వెంకటరామారెడ్డి చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న సిఎం కెసిఆర్