రాష్ట్రీయం

శ్రీవారి ఆలయం వద్ద భద్రతా ఏర్పాట్లు డొల్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, జనవరి 14 : శ్రీవారి ఆలయంలో పని చేసే సిబ్బంది నేరుగా ఆలయంలోకి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ ప్రవేశ మార్గం గుండా ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లు గురువారం ఆలయంలోకి ప్రవేశించారు. డ్రైవర్లు ఖాకీ డ్రస్సు వేసుకోవడంతో భద్రతా సిబ్బంది పెద్దగా పట్టించుకోలేదు. అయితే సిసి కెమేరాలు వాళ్లను పట్టించాయి. సిసి కెమేరాలను పర్యవేక్షించే సిబ్బంది అప్రమత్తమై డ్రైవర్లను పడికావలి వద్ద ఆపేశారు. డ్రైవర్లు ఇద్దరూ నరసరావుపేట డిపోకు చెందిన వారిగా విచారణలో తేలింది. పొరపాటు జరిగిపోయిందని వారు లిఖితపూర్వకంగా రాసి ఇవ్వడంతో వదిలి వేశారు. చీమ చిటుక్కుమన్నా తాము అప్రమత్తంగా ఉంటామని చెప్పుకుంటున్న బయోమెట్రిక్ భద్రతా సిబ్బంది డొల్లతనాన్ని ఈ సంఘటన బయటపెట్టింది. శ్రీవారి ఆలయంలో విధులు నిర్వహించే సిబ్బంది,సేవకులను పూర్తిగా తనిఖీ చేసి ఆలయంలోకి అనుమతించేందుకు మహద్వారం సమీపంలో టిటిడి ఒక భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసింది. ఆలయంలోకి వెళ్లేవారైనా, ఆలయంలో నుంచి వెలుపలికి వెళ్లే సిబ్బంది ఎవరైనా బయోమెట్రిక్‌లో తమకు ఇచ్చిన ఐడి కార్డు చూపించి తనిఖీ చేసుకుని వెళ్లాలి.
శ్రీవారి సేవకులు అయితే సంబంధిత అధికారులు ఇచ్చే పత్రాన్ని చూపిస్తే అందులో పొందుపరిచిన పేర్లు ప్రకారం వారి వద్ద ఉన్న ఐడి కార్డులను తనిఖీ చేస్తుంటారు. అలాంటిది ఇంత భద్రతావ్యవస్థ ఉన్నప్పటికీ డ్రైవర్లు సునాయాసంగా లోపలికి ప్రవేశించడం గమనార్హం.