రాష్ట్రీయం

ఇక ట్రెజరీనుంచే జీతాలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 7: గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి), విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులకు శుభవార్త! ఇప్పటి వరకూ ఆయా మున్సిపాలిటీలకు వచ్చే ఆదాయం నుంచే ఉద్యోగులు జీతాలు తీసుకునేవారు. కానీ త్వరలోనే వీరికి ట్రెజరీ నుంచి జీతాలు అందే అవకాశం ఉందని జివిఎంసి వర్గాలు తెలియచేస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల ఉద్యోగులకు జీతాలు ట్రెజరీ నుంచి చెల్లిస్తున్నారు. కేవలం జివిఎంసి, విజయవాడ నగరపాలక సంస్థ ఉద్యోగులకు మాత్రం ఆయా మున్సిపల్ కార్పొరేషనే్ల చెల్లిస్తున్నాయి. జివిఎంసిలో శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులు సుమారు 10 వేల మంది వరకూ ఉన్నారు. కొద్ది నెలల కిందటి వరకూ వీరికి నెలకు 25 కోట్ల రూపాయల వరకూ జీతాల కింద ఖర్చయ్యేది. పిఆర్‌సి వచ్చిన తరువాత సుమారు మరో ఐదు కోట్ల భారం పెరిగింది. ఇక విజయవాడ నగరపాలక సంస్థ ఉద్యోగులకు ప్రతి నెలా సుమారు 20 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. ఈ రెండు కార్పొరేషన్ల ఉద్యోగులకు కలిపి జీతాల కింద 55 నుంచి 60 కోట్ల రూపాయల వరకూ చెల్లించాల్సి వస్తోంది. ఆయా మున్సిపల్ కార్పొరేషన్లకు పన్నులు, అద్దెలు తదితర మార్గాల ద్వారా వచ్చే ఆదాయంతో ఈ జీతాలను చెల్లిస్తూ వచ్చేవారు. తమ జీతాలను కూడా ట్రెజరీ ద్వారా చెల్లించాలని జివిఎంసి, విజయవాడ కార్పొరేషన్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఖజానా పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉండడంతో ప్రభు త్వం ఈ డిమాండ్‌ను పక్కన పెట్టింది. అయితే, ఈ డిమాండ్‌ను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయం తీసుకుందని జివిఎంసి అధికారులు చెపుతున్నారు. దీనికి సంబంధించిన ఫైల్‌పై సిఎం త్వరలోనే సంతకం చేస్తారని చెపుతున్నారు.
ఆదాయానికి గండి పడే అవకాశం!
ప్రతి నెలా కచ్చితంగా ఈ రెండు మున్సిపల్ కార్పొరేషన్లలో ఉద్యోగులు జీతాలు తీసుకోవాలంటే, విధిగా టాక్స్‌లు వసూలు చేయాల్సి ఉంటుంది. ఆదాయ మార్గాలు తగ్గిపోతే, జీతాల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుందన్న విషయం సంబంధిత ఉద్యోగులకు తెలుసు. అందుకే పన్నుల వసూళ్లను అప్పుడప్పుడు వేగవంతం చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఈ ఉద్యోగులకు ట్రెజరీ నుంచి నేరుగా జీతాలు చెల్లిస్తే, ఇక వారు పన్నుల వసూళ్లకు ఉత్సాహం చూపించకపోవచ్చన్న అనుమానాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం భారం మోయగలదా?
ప్రభుత్వ ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువగా ఉంది. ఇప్పటికే చాలా బిల్లులపై ఆంక్షలు విధించింది. ప్రతినెల ఒకటో తేదీకి ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికే ప్రభుత్వం మీనమేషాలు లెక్కపెట్టాల్సి వస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఖజానాపై 55 నుంచి 60 కోట్ల భారీ పడితే మోయగలదా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.