రాష్ట్రీయం

ఇక మెట్రో రైలు కూతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 7: మూడేళ్ల కిందట ప్రారంభం కావాల్సిన హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టుకు ఎట్టకేలకు మోక్షం లభించబోతుంది. మొదటి దశ మెట్రోరైలు ప్రాజెక్టును నవంబర్ నెలాఖరున ప్రారంభించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆహ్వానిస్తూ గురువారం లేఖ రాసారు. నవంబర్ 28 నుంచి 30 వరకు హైదరాబాద్‌లో జరుగనున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ప్రారంభించడానికి ఎలాగు హైదరాబాద్ రావడానికి సమ్మితించడంతో అదే సందర్భంగా మెట్రోరైలు ప్రాజెక్టును కూడా ప్రారంభించాలని ప్రధానిని ముఖ్యమంత్రి కోరారు. పట్టణ ప్రాంత ప్రజల రవాణా సౌకర్యం కోసం నిర్మిస్తున్న ప్రతిష్టాత్మకమైన, అతి పెద్ద ప్రాజెక్టుగా హైదరాబాద్ మెట్రోరైలు నిలుస్తుందని తన లేఖలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దాదాపు రూ.15 వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు దేశంలోనే అతి పెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్ షిప్ (పిపిపి) ప్రాజెక్టుగా నిలువబోతుందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. మెట్రోరైలు ప్రాజెక్టును ప్రారంభించాల్సిందిగా మే నెలలో తమతో జరిగిన భేటీ సందర్భంగా స్వయంగా కోరిన విషయాన్ని ప్రధానికి ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఇలా ఉండగా మూడు కారిడార్లలో మొత్తం 72 కి.మీటర్ల మేర మెట్రోరైలు ప్రాజెక్టు పనులు జరుగుతుండగా మొదటి దశలో మియాపూర్-అమీర్‌పేట మార్గం 13 కి.మీ, అమీర్‌పేట-నాగోల్ మార్గం 17 కి.మీ మొత్తంగా 30 కి.మీ మార్గం అందుబాటులోకి రానుంది. ఈ మార్గంలో ఇప్పటికే స్టేషన్ల నిర్మాణం
పూర్తి కావడంతో పాటు ట్రయల్ రన్, భద్రతాపరమైన అనుమతులు
లభించడంతో ఈ మార్గాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
15 ఏళ్ల కిందట మొగ్గ తొడిగిన ఆలోచన
హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణ ఆలోచన 15 ఏళ్ల కిందట 2003లో మొగ్గ తొడిగింది. హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాలలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిపోవడంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దక్షిణ మధ్య రైల్వే సంయుక్తంగా రూ.167 కోట్ల వ్యయంలో సమాన భాగస్వామ్యంతో మల్టీ మాడల్ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్‌కు శ్రీకారం చుట్టింది. అయితే ప్రయాణికుల రద్దీని ఎంఎంటిఎస్ ఏ మాత్రం తట్టుకోలేకపోయింది. దీంతో 2021 నాటికి హైదరాబాద్ జంట నగరాల ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మెట్రోరైలు ప్రాజెక్టును చేపట్టడానికి సర్వే చేయాల్సిందిగా ఢిల్లీ మెట్రోరైలు ప్రాజెక్టును కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆదేశించింది. ఐదేళ్ల కాల పరిమితిలో 71 కి.మీ మెట్రోరైలు మార్గం, 66 స్టేషన్లతో హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు ఏర్పాటు చేయవచ్చని సర్వేలో వెల్లడించింది.
ఈ మేరకు మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణానికి 2008లో టెండర్లను ఆహ్వానించగా మైటాస్ సంస్థ దక్కించుకుంది. అయితే ఏడాది గడిచిన తర్వాత కూడా ప్రాజెక్టు పనులు ప్రారంభించకపోవడంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైటాస్‌కు అప్పగించిన కాంట్రాక్ట్‌ను 2009 జూలైలో రద్దు చేసింది. టెండర్లను తిరికి 2010లో ఆహ్వానించగా ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టి కాంట్రాక్టును దక్కించుకుని 2012 ఏప్రిల్ 26న భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించింది. ఐదు సంవత్సరాల వ్యవధిలో మొదటి దశ మార్గాన్ని పూర్తి చేయడానికి ఎల్ అండ్ టి ఒప్పందం చేసుకుంది. అయితే చారిత్రక కట్టడాలు, వారసత్వ నిర్మాణాల మీదుగా మెట్రోరైలు మార్గం వెళ్లడాన్ని రాజకీయ పక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రధానంగా శాసనసభ, సూల్తాన్ బజార్ మీదుగా మెట్రోరైలు మార్గాన్ని మార్చాలని అప్పటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమ పార్టీగా ఉన్న టిఆర్‌ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. అప్పటి ఉద్యమ నాయకుడి హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి కెసిఆర్ మెట్రోరైలు అలైన్‌మెంట్‌ను మార్చకపోతే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం తీవ్రరూపం దాల్చడం, మెట్రోరైలు మార్గం వివాదంగా మారడం తదితర కారణాలతో సకాలంలో పనులు జరుగలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పుడు వ్యతిరేకించిన టిఆర్‌ఎస్ పార్టీయే అధికార పగ్గాలు చేపట్టాక మెట్రోరైలు ప్రాజెక్టును పాత అలైన్‌మెంట్ ప్రకారమే జరుపుకోవడానికి అంగీకారం తెలిపింది. దీంతో 2015లో ప్రారంభం కావాల్సిన మెట్రోరైలు రెండేళ్ల జాప్యం తర్వాత ఎట్టకేలకు నవంబర్ మాసంలో మోక్షం లభించనుంది.