రాష్ట్రీయం

అర్చకులకు నిరాశే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 14 : రాష్ట్ర ప్రభుత్వంపై భారీ ఆశలు పెట్టుకున్న తెలంగాణ ప్రాంతంలోని అర్చకులు, మతపరమైన ఆలయ సిబ్బంది (రిలీజియస్ ఎంప్లాయిస్) నిరాశకు గురవుతున్నారు. ఆలయాల్లో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు (ఇఓ), ఆ పైస్థాయి ఉద్యోగుల తరహాలో తమకు కూడా ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలన్న ప్రధాన డిమాండ్‌తో గత ఏడాది కాలంగా ఏదో ఒకరకమైన ఆందోళన చేస్తూనే ఉన్నారు. 2015 ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో దాదాపు 13 రోజుల పాటు సమ్మె చేశారు. దేవాలయాల్లో ఆర్జిత సేవలన్నింటినీ నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు.
అంతకు ముందు కూడా వారు ఆందోళన చేశారు. దాంతో ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు వచ్చింది. దాదాపు ఆరువేల మంది అర్చకులు, ఉద్యోగులకు ప్రభుత్వం తరఫున దేవాదాయ మంత్రి అల్లోళ్ల ఇంద్రకరణ్‌రెడ్డి హామీ ఇచ్చారు. అర్చకులు, దేవాదాయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ సుముఖంగానే ఉన్నారని, సాంకేతిక ఇబ్బందుల వల్ల కొంత సమయం పడుతుందని మంత్రి ఆనాడు పేర్కొన్నారు. గత అయిదు నెలల నుండి అర్చకులు, ఆలయ ఉద్యోగుల నేతలు సచివాలయానికి తరచూ వస్తూనే ఉన్నారు. పలుదఫాలుగా చర్చలు జరిగినా ఇప్పటి వరకు ఎలాంటి ఫలితం రాలేదు. అర్చకులు, ఆలయ ఉద్యోగులు తమ డిమాండ్లు ఎప్పుడు నెరవేరతాయా అంటూ ఎదురు చూస్తున్నారు.