రాష్ట్రీయం

జీవో 39పై 11న ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 7: తెలంగాణ ప్రజల పాలిట తెరాస ప్రభుత్వ పాలన శాపంగా మారిందని టిపిసిసి అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ వైఖరి వల్ల రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతోందని అన్నారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రైతుల విషయంలో సిఎం కెసిఆర్ పూర్తి నిర్లక్ష్యం వహించారని అన్నారు. రుణమాఫీ, వడ్డీ భారం ప్రభుత్వమే భరిస్తుందని శాసనసభలో సిఎం కెసిఆర్ చెప్పి, ఆచరణలో మాట మార్చారని అన్నారు. తెరాస మూడేళ్ల పాలనలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 107 లక్షల టన్నుల నుంచి 47 లక్షల టన్నులకు పడిపోగా, పంటల బీమా ద్వారా ఒక్క రూపాయి రైతులకు అందలేదని అన్నారు. ఏ పంటకూ కూడా మద్దతు ధర ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితిలో రైతుల నెత్తిన రైతు సమన్వయ సమితులు పేరుతో తెరాస నేతలు, ప్రజాప్రతినిధులకు అధికారం కట్టబెడుతూ రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేయడం దారుణమని అన్నారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం జారీ చేసిన జివో 39ను తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఈ నెల 11న అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ధర్నా చేపట్టాలని నిర్ణయించినట్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో రైతులను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు సంరక్షణ సమితులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న రైతు సమన్వయ సమితులు అనేది పూర్తిగా తెరాస కమిటీలుగా భావించాల్సి వస్తోందని, రైతులకు, రైతు సంఘాలకు ఇది ఎంతమాత్రం ఆమోద యోగ్యం కాదని అన్నారు. ఎన్నికల స్టంట్ మాదిరగా ఎకరాకు రూ.4 వేల ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ పథకాన్ని అన్ని రకాల భూములకు వర్తింప చేయాలని, అసైన్డ్ భూములకూ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

చిత్రం..మీడియా సమావేశంలో మాట్లాడుతున్న టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి