రాష్ట్రీయం

తెలంగాణలో పది పాఠశాలలను దత్తత తీసుకున్న‘టీచ్ ఫర్ చేంజ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, సెప్టెంబర్ 7: దేశవ్యాప్తంగా పలు పాఠశాలలను దత్తత తీసుకొని, వౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్యార్థులకు మెరుగైన విద్యనందించేందుకు కృషి చేస్తున్న టీచ్ ఫర్ చేంజ్ సంస్థ తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో పది పాఠశాలలను దత్తత తీసుకున్నది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలో ఈ పాఠశాలలు ఉండటం గమనార్హం. ఈ కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి కూసుమంచి మండలం జీళ్ళచెర్వు ఉన్నత పాఠశాలలోగురువారం లాంఛనంగాప్రారంభించారు. సినీనటి మంచులక్ష్మి ఆధ్వర్యంలోని ఈ సంస్థ ఆయా పాఠశాలల్లో మరుగుదొడ్లు, మంచినీరు, లైబ్రరీ లాంటివి అందించడంతో పాటు ప్రతిరోజు వార్తాపత్రికలు తెప్పిస్తారు. మూడు నెలలకొకసారి అపోలో ఆసుపత్రుల సహకారంతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా రేణుకాచౌదరి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాల పరిధిలోని జీళ్ళచెరువు, కాకరవాయి, జన్నారం, ముల్కలపల్లి, సుజాతనగర్, కారేపల్లి, పెనుబల్లి, అశ్వారావుపేట, రిక్కాబజార్ పాఠశాలలను దత్తత తీసుకున్నారని, తొలిసారిగా ఈ సంస్థ గ్రామీణ స్థాయిలోని పాఠశాలలను అభివృద్ధిపర్చేందుకు నిర్ణయించుకుందన్నారు. ఆయా గ్రామాల్లో విద్య, వైద్య రంగాలను అభివృద్ధి పర్చేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రతి విద్యార్థి ఇంగ్లీష్ భాషలో పట్టు సాధించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటారన్నారు. సంస్థ సిఇఓ చైతన్య మాట్లాడుతూ రేణుకాచౌదరి సహకారంతో ఈ పాఠశాలలను దత్తతు తీసుకున్నామని, తమ సంస్థ ద్వారా కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో అనేక పాఠశాలల్లో వౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి కార్యక్రమం చేపడుతున్నామని వెల్లడించారు. తహశీల్దార్ కృష్ణ, ఎంపిడిఓ విద్యాచందన, ప్రతినిధులు పుల్లయ్య పాల్గొన్నారు.