రాష్ట్రీయం

జర్నలిస్ట్ గౌరీ హత్యను ఖండించిన పవన్ కల్యాణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 7: సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ దారుణ హత్యను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా ఖండించారు. ఈ హత్య ద్వారా భావ ప్రకటన స్వేచ్ఛను భగ్నం చేశామనుకుంటే పొరపాటని, ఇటువంటి పిరికి చర్యలు పనికిరావని అన్నారు. సామాజిక న్యాయం, సామాజిక బాధ్యతను గుండెల్లో నింపుకున్న జర్నలిస్టును హతమార్చి కథ ముగిసిందని అనుకోవద్దని, అటువంటి గౌరి లంకేశ్‌లు కోట్లమంది పుట్టుకొస్తారని పవన్ కల్యాణ్ అన్నారు. గౌరి ఆత్మకు శాంతి కలగాలని ఆయన కోరారు. ఎదుటి వ్యక్తి అభిప్రాయాలతో ఏకీభవించనప్పుడు వారిని హతమార్చాలనుకోవడం దారుణమని పేర్కొన్నారు. మన ప్రత్యర్థికి చర్చించడానికి అంశాలు కరువైనప్పుడే మందుగుండు అవసరం ఏర్పడుతుందన్న ఆర్ధిక వేత్త హెర్నాండో డిసోటో మాటలను పవన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.