రాష్ట్రీయం

శ్రీశైలానికి భారీ వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, సెప్టెంబర్ 9: శ్రీశైలం జలాశయానికి ఎగువ నంచి వరద రాక మళ్లీ మొదలైంది. నాలుగు రోజుల నుంచి ఎగువ నుంచి వరద నీరు వస్తోంది. అయితే శుక్రవారం ఇన్‌ఫ్లో నమోదుకాలేదు. శనివారానికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏకంగా 71 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తు తం 816.60 అడుగులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టిఎంసిలు కాగా ప్రస్తుతం 38.40 టియంసిలుగా ఉంది. జూరాల నుండి 40 వేల క్యూసెక్కులు, రోజా నుంచి 31,353 క్యూసెక్కులు కలిపి మొత్తం 71,353 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి చేరుకుంది. ఇటీవలి కాలం లో ఇంత భారీ మొత్తంలో ఇన్‌ఫ్లో నమోదుకావడం ఇదే మొదటి సారి.