రాష్ట్రీయం

50% సబ్సిడీ, ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, సెప్టెంబర్ 10 : రాష్ట్రంలో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామని, అందుకోసం పరిశ్రమల ఏర్పాటుకు 50 శాతం సబ్సిడీ అందజేసి మహిళా ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచి గ్రామం వద్ద ఏర్పాటు చేస్తున్న ‘కియా’ కార్ల కంపెనీ భూమి పనుల పురోగతిని మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. అలాగే అక్కడి టూరిజం అతిథి గృహంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కియా పరిశ్రమల కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. విభజన అనంతరం రాష్ట్రంలో తెలుగుదేశంపార్టీ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దూరదృష్టితో పరిశ్రమల స్థాపనకు ప్రత్యేక చొరవ తీసుకున్నారన్నారు. అనంతపురం జిల్లాలో 600 ఎకరాల్లో రూ. 13,500 కోట్లతో కియా కార్ల పరిశ్రమను నెలకొల్పుతున్నారన్నారు. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 11వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కియాకు అనుబంధంగా పరిశ్రమలు రావడం ద్వారా అనంతపురం జిల్లా ఇండస్ట్రియల్ హబ్‌గా రూపుదిద్దుకుంటుందన్నారు. కియా ప్రాజెక్టు రాకతో దేశంలోని పరిశ్రమలతో పాటు ప్రపంచంలోని అనేక దిగ్గజ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తున్నాయన్నారు. చిత్తూరు జిల్లాలో అపోలో టైర్ల పరిశ్రమ ఈ నెలలోనే రూపుదిద్దుకుంటుందని తెలిపారు. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పట్టు పరిశ్రమను ప్రోత్సహించడం కోసం మెగా సిల్క్ టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
ఇక ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు పరిశ్రమలు స్థాపించేందుకు ఆర్థిక సాయాన్ని యూనిట్‌కు(పరిశ్రమ) రూ. 15 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచుతున్నామన్నారు. దేశంలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో మన రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని, సింగిల్‌విండో ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడంతో 94 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఒక సర్వేలో వెల్లడైందన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక ఎంఎస్‌ఎంఇ ఏర్పాటు చేస్తామని, వాటికి సంబంధించి ఒక కార్పొరేషన్, కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఎంఎస్‌ఎంఇల ఏర్పాటుకు రూ. 100 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఈ నిధులను వారి ఖాతాల్లో నేరుగా జమ చేసి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా అర్హులకు అందిస్తున్నామన్నారు. త్వరలో వైజాగ్‌లో మూడో ఎంఎస్‌ఎంఇల సమ్మిట్(సదస్సు) ఏర్పాటు చేస్తామన్నారు. వైజాగ్-చెన్నై, చెన్నై-బెంగళూరు కోస్టల్ కారిడార్ల అభివృద్ధికి రూ. 5,500 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. మొదటి దశలో చెన్నై-బెంగళూరు కారిడార్‌కు రూ. 1,800 కోట్లు వెచ్చిస్తున్నామని మంత్రి తెలిపారు. మంత్రితో పాటు మంత్రి పరిటాల సునీత, పెనుకొండ ఎమ్మెల్యే బికె.పార్థసారధి, ఎమ్మెల్సీ పయ్యావులకేశవ్, కలెక్టర్ జి.వీరపాండియన్ ఉన్నారు.

చిత్రం..అనంతపురం జిల్లా ఎర్రమంచి గ్రామం వద్ద ఏర్పాటు చేస్తున్న కియా కార్ల పరిశ్రమ పనులను పరిశీలిస్తున్న మంత్రులు అమర్‌నాథ్‌రెడ్డి, సునీత, ఎమ్మెల్సీ కేశవ్, ఎమ్మెల్యే పార్థసారధి, కలెక్టర్ వీరపాండియన్