రాష్ట్రీయం

స్వైన్‌ఫ్లూతో ఏసిపి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, సెస్టెంబర్ 10: స్వైన్‌ఫ్లూతో ఓ పోలీసు అధికారి మృతి చెందారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని వర్ధన్నపేట పోలీస్ సబ్‌డివిజన్ ఏసిపి దుర్గయ్య యాదవ్ సైన్‌ఫ్లూ బారినపడి ఐదురోజులుగా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం కన్నుమూశారు. అతని పార్థివ దేహా న్ని వరంగల్‌లోని ఆయన స్వగృహానికి తీసుకువచ్చారు. పూర్వ ఖమ్మం జిల్లా కారేపల్లిలో జన్మించిన దుర్గయ్య యాదవ్ నల్లగొండ జిల్లా కోదాడలో తన సోదరి వద్ద ఉంటూ విద్యాభ్యాసం పూర్తిచేసారు. 1992లో ఎస్సైగా పోలీసు శాఖలో చేరిన దుర్గయ్య మొగళ్లపల్లి, రేగొండ, శాయంపేట, నగరంలోని కాకతీయ యూనివర్సిటీ, వర్ధన్నపేట ఎస్సైగా పనిచేసారు. 610 జిఓ కారణంగా ఆయన హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. 2008లో ఇన్‌స్పెక్టర్‌గా ప్రమోషన్ పొందిన దుర్గయ్య ఇంటెలిజెన్స్, విజిలెన్స్ విభాగాలతోపాటు హైదరాబాద్ నగరంలోని వివిధ పోలీసు స్టేషన్లలో పనిచేసారు. డిఎస్పీగా పదోన్నతి పొందిన ఆయన ఈ ఏడాది కొత్తగా ఏర్పడిన వర్ధన్నపేట పోలీస్ సబ్‌డివిజన్‌లో ఏసిపిగా బాధ్యతలు చేపట్టారు. వారం రోజులు కిందట ఆయన విధి నిర్వహణలో ఉన్న సమయంలో అస్వస్థతకు గురికావటంతో మొదట హన్మకొండలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్చారు. కానీ వ్యాధి తీవ్రత కారణంగా సికింద్రాబాద్ యశోదకు తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు స్వైన్‌ప్లూగా గుర్తించి ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఇంటెన్సివ్‌కేర్ యూనిట్‌లో చేర్చారు. ఐదు రోజులుగా వైద్యులు ఎంత ప్రయత్నించినా వ్యాధి తగ్గుముఖం పట్టకపోగా ఆదివారం ఉదయం 10.30 సమయంలో దుర్గయ్య యాదవ్ కన్నుమూశారు. ఎస్సై నుంచి ఏసిపిగా పనిచేసిన సమయంలో దుర్గయ్య యాదవ్ అనుసరించిన వ్యవహారశైలి ప్రజలకు దగ్గరయ్యేలా చేసింది. పేదవిద్యార్థులకు చదువుల కోసం ఆర్థిక సహాయం అందించడంతోపాటు ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకునే వ్యక్తి కావడంతో పనిచేసిన ప్రతిచోట తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు లభించేది. దుర్గయ్య యాదవ్ భార్య న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తుండగా ఆయన ఇద్దరు కుమార్తెలు ఇంజనీరింగ్ చదువుతున్నారు. దుర్గయ్య మరణవార్త వరంగల్ నగర పోలీసు యంత్రాంగంతోపాటు ఆయనతోపాటు పనిచేసిన, పరిచయాలు ఉన్న ప్రస్తుత భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో పనిచేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది షాక్‌కు గురయ్యారు. యంత్రాంగం తెలియగానే వరంగల్ జిల్లాలోని పలువురు పోలీస్ అధికారులు, నాయకులు హుటాహూటిన హైదరాబాద్ తరలివెళ్లారు. అంతిమ సంస్కారాల కోసం దుర్గయ్య యాదవ్ పార్ధివదేహాన్ని హన్మకొండకు తరలించారు.

దుర్గయ్య యాదవ్ (ఫైల్‌ఫొటో)