రాష్ట్రీయం

ప్రమాదాల నివారణకు పక్కా ప్రణాళిక?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 10: జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రమాదాల నివారణకు అధికారులు పక్కా ప్రణాళిక రూపొందించారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం అధ్వర్యంలో ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టం (ఐటిఎంఎస్)ను ఆవిష్కరించనున్నారు. ఈ ఐటిఎంఎస్‌ను వచ్చే నవంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో గ్లోబల్ ఎంటర్‌ప్యూనర్ సమ్మిట్‌ను ప్రారంభించేందుకు రానున్న సందర్భంగా ఆయన చేతుల మీదుగా ఈ వినూత్న ఐటిఎంఎస్‌ను ఆవిష్కరించనున్నట్టు ఓ పోలీస్ సీనియర్ అధికారి తెలిపారు. ట్రాఫిక్ జంక్షన్ మేనేజ్‌మెంట్, డిటెక్షన్ ఆఫ్ వయోలేషన్స్‌తో ట్రాఫిక్ మూమెంట్స్‌ను పసిగట్టే వీలుగా పనిచేయనున్న ఈ వినూత్న ప్రయోగంతో రోడ్డు ప్రమాదాల నివారణతోపాటు ట్రాఫిక్ సమస్యను అధిగమించవచ్చని అధికారులు చెబుతున్నారు. ఐటిఎంఎస్‌కు వాటర్ లాగింగ్ డిటెక్టర్‌ను అనుసంధానం చేస్తే ప్రత్యామ్నాయ రహదారులు, ప్రమాదాలు ముందే తెలిసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాష్ట్ర, జాతీయ రహదారులపై పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు కూడా అధికారులు కసరత్తు ప్రారంభించారు. ట్రాఫిక్ విభాగంతోపాటు పోలీస్, ట్రాన్స్‌పోర్టు, ఆర్‌అండ్‌బి, మెడికల్ హెల్త్ శాఖలు రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణపై తగు చర్యలు తీసుకోనుంది. ఈ మేరకు ఆయా శాఖల భాగస్వామ్యంతో కోఆర్డినేట్ చేయగలిగే ఈ వినూత్న పథకాన్ని త్వరలో ప్రారంభం గానుందని అధికారులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రమాదాల నివారణకు తగు చర్యలు చేపట్టగా, కేంద్ర ప్రభుత్వం అందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందని, దీనికి సంబంధించి పలు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించినట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (రైల్వే అండ్ రోడ్ సేఫ్టీ) టి కృష్ణప్రసాద్ తెలిపారు. ఇందుకోసం వాహనాల కొనుగోలుకు రూ. 20 కోట్లు, పోలీస్ స్టేషన్ల భవనాల నిర్మాణాలకు మరో రూ. 30 కోట్లు ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిసింది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ట్రాన్స్‌పోర్ట్, రోడ్డు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ వీటి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. ఈ వినూత్న ఐటిఎంఎస్‌పై ప్రభుత్వం యోచిస్తోందని, త్వరలోనే ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.