రాష్ట్రీయం

ఇక పారిశ్రామిక తీరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 11: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ తీరంలో భారీ పరిశ్రమలకు ఏర్పాటుకు మార్గం సుగమమైంది. రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంమేరకు తీరంలో భారీ పరిశ్రమల స్థాపన వ్యవహారం కొలిక్కి వచ్చింది. మూడేళ్లుగా ఊరిస్తున్న పలు ప్రాజెకులు కొలువు తీరడానికి దారులు ఏర్పడ్డాయ. కొత్త పోర్టు సహా రూ.1169 కోట్ల పెట్టుబడితో ఏడు భారీ పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు కానున్నాయి. అలాగే వేల కోట్ల వ్యయంతో ప్రభు త్వ, ప్రైవేటు పార్టనర్ షిప్ పద్ధతిలో పలు ప్రాజెక్టులు నిర్మాణం కానున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి మూడున్నరేళ్లు గడచిన నేపథ్యంలో ఇప్పటికే ఆయా సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించారు. తాజాగా నిర్వహించిన కేబినేట్ సమావేశంలో కాకినాడ తీరంలోని కోన ప్రాంతంలో కొత్త పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పోర్టు నిర్మాణాన్ని చేపట్టడానికి అవసరమైన ఆదేశాలను ప్రభుత్వం జారీచేసింది. ఏపీ పెట్రోకెమికల్ ప్రాజెక్టు ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. గతంలో కాకినాడ తీర ప్రాంతానికిచ్చిన హామీలతో పాటు ఇటీవల సిఎం చంద్రబాబు కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలకూ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కోనలో త్వరలో మూడో పోర్టు నిర్మిస్తామని చంద్రబాబు ప్రకటించారు. వెనువెంటనే దీని నిర్మాణానికి కేబినేట్ సమావేశంలో ఆమోదం తెలిపారు. ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఏపీ పెట్రోకెమికల్ ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో అధికార యంత్రాంగం ఈ ప్రాజెక్టుకు అవసరమైన వౌలిక సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టింది. ఏపీ పెట్రోకెమికల్ ప్రాజెక్టును గెయిల్, హెచ్‌పిసిఎల్, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్నాయి. కాకినాడ సెజ్‌లో 2వేల ఎకరాల భూమిని ప్రాజెక్టుకు కేటాయించారు. ఉద్యోగుల టౌన్‌షిప్‌కు 150 ఎకరాలను సెజ్‌లోనే కేటాయించారు. పెట్రోకెమికల్ ప్రాజెక్టుకు ముడి సరుకుల దిగుమతి, నిల్వ, ఎగుమతి తదితర వసతుల కోసం మరో 100 ఎకరాలను కాకినాడ పోర్టు పక్కనే కేటాయించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సిఎం చంద్రబాబు త్వరలో శంకుస్థాపన చేయనున్నారు. భారీ పరిశ్రమలకు అనుబంధంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలనూ ప్రోత్సహిస్తున్నారు. కాకినాడ తీరంలో రూ.345 కోట్ల పెట్టుబడితో 414 చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అనుమతులు జారీచేశారు. కాకినాడ సెజ్ కార్యకలాపాలను ముమ్మరంచేసే దిశగా సంస్థ యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది.