రాష్ట్రీయం

టీచర్ల భర్తీపై నిర్లక్ష్యమా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: తెలంగాణలో టీచర్ల నియామకం చేపట్టకుం డా వాయిదా కోరడంపై సుప్రీంకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ పాఠశాలలో వౌలిక సదుపాయల కల్పన, ఉపాధ్యాయ నియామకాలపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఖాన్విల్కార్, జస్టిస్ చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ఉపాధ్యాయ నియామకాలపై మరింత సమయం కావాలని తెలంగాణ తరపు న్యాయవాది ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి గతంలో సుప్రీంకోర్టు సెప్టెంబర్ వరకూ గడువిచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామని, సెప్టెంబర్‌లోగా ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే మరో రెండు నెలలపాటు గడువు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను అక్టోబర్ 28కి వాయిదా వేసింది.