రాష్ట్రీయం

డిజైన్లు మార్చండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 14: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించినట్లు అమరావతిలో పాలనాభవనాలకు శంకుస్థాపనపై సందిగ్ధత ఏర్పడింది. నార్మన్ ఫోస్టర్ బృందం సమర్పించిన డిజైన్లపై బాబు సంతృప్తి వ్యక్తం చేయకపోవడంతోపాటు మరికొంత సమయం తీసుకోవాలని చెప్పడంతో ముందు ప్రకటించినట్లు విజయదశమి రోజున పరిపాలనా భవనం , అసెంబ్లీ భవనాల శంకుస్థాపనపై సందేహాలు నెలకొన్నాయి. గురువారం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు కూడా స్పష్టత ఇవ్వకపోవడం, మంత్రి నారాయణ కూడా వౌనం వహించడంతో దసరాకు శంకుస్థాపన ఉండకపోవచ్చ ని స్పష్టమవుతోంది. అయితే డిజైన్ల ఖరారుకు సమయం ఉన్నందున మంచి రోజయిన దసరా రోజు శంకుస్థాపనకు ఎలాంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చని అధికారులు చెప్పారు. డిజైన్ల ఖరారుకు, శంకుస్థాపనకు సంబంధం లేదని ఓ అధికారి వ్యాఖ్యానించారు. కాగా పరిపాలన నగరంలోని ముఖ్య భవంతుల తుది ఆకృతులు, నిర్మాణ వ్యూహ ప్రణాళికలను సిద్ధం చేయడానికి మరికొంత సమయం తీసుకోవాలని నార్మన్ ఫోస్టర్ బృందానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. గురువారం ఆయన ఆ బృందంతో సమీక్ష నిర్వహించారు. ఇప్పుడు అందించిన ఆకృతుల్లో కొన్ని ఎలిమెంట్స్ బావున్నాయని, బాహ్య రూపం అంత గొప్పగా రాలేదని నార్మన్ ఫోస్టర్ బృందంతో బాబు వ్యాఖ్యానించారు. రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు, పురపాలక మంత్రి నారాయణలతో కలిసి ఫోస్టర్ బృందం అందించిన ఆకృతులను పునఃపరిశీలించిన సందర్భంగా వారికి కొన్ని సూచనలు చేశారు. ఈ ఆకృతులపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోందని మరింత సమయం తీసుకుని అత్యద్భుతమైన డిజైన్లు రూపొందించాలని ఫోస్టర్ బృందాన్ని కోరారు. ప్రపంచంలోని తొలి 10 అత్యుత్తమ భవంతుల నిర్మాణాలను స్పూర్తిగా తీసుకుని వాటిని తలదనే్న రీతిలో ఆకృతులు తయారుచేయాలని, సిఆర్‌డిఎలో పనిచేస్తున్న ఆర్కిటెక్టులు, రాష్ట్రంలో పేరొందిన ఆర్కిటెక్టులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి డిజైన్ల రూపకల్పనలో ఫోస్టర్ బృందానికి సహకరించాలని సూచించారు. తెలుగు చలనచిత్ర రంగ దర్శకుడు ఎస్‌ఎస్ రాజవౌళితో వెంటనే సంప్రదింపులు జరపాలని సిఆర్‌డిఎ కమిషనర్‌ను ఆదేశించారు. అవసరమైతే తన బృందంతో సహా రాజవౌళిని లండన్ పంపించి, ఆకృతుల తయారీలో ఫోస్టర్ సంస్థకు తగు సూచనలు, సలహాలు ఇచ్చేట్టుగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అక్టోబర్ 25న తాను స్వయంగా లండన్ వెళ్లి ఫోస్టర్ కార్యాలయాన్ని సందర్శించి అక్కడ వారు రూపొందించే ఆకృతులను పరిశీలిస్తానని వెల్లడించారు. వచ్చే నెలలో యుఎస్, యుఎ ఈ పర్యటనతో పాటు యుకె వెళ్లాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. నార్మన్ ఫోస్టర్ సమర్పించే ఆకృతులను అక్టోబర్ నెలాఖరులోగా ఖరారు చేయవచ్చునని సిఎం సూచనాప్రాయంగా వెల్లడించారు.

చిత్రం..నార్మన్ ఫోస్టర్ అందించిన డిజైన్లను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు