రాష్ట్రీయం

గ్రూప్-2 ప్రక్రియకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 14: గ్రూప్-2 నియామక ప్రక్రియకు హైకోర్టు గురువారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిం ది. అభ్యర్ధుల సర్ట్ఫికేట్లు పరిశీలించకోవచ్చని తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు సూచించింది. అభ్యర్ధుల వినతి మేరకు 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు పిలిచినందున ఇంకా ఏమైనా అభ్యంతరాలుంటే వారు కోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంది. జూన్ 12న హైకోర్టు ఈ అంశంపై స్టే ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత స్టే ఉత్తర్వుల గడువు ముగియడంతో గురువారం నాడు మెయిన్ పిటీషన్‌ను హైకోర్టు విచారించింది. వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తులు వచ్చే నెల 9వ తేదీలోగా సర్ట్ఫికేట్ల పరిశీలన చేసుకోవచ్చని సూచించారు. తదుపరి విచారణను కోర్టు వచ్చే నెల 9వ తేదీకి వాయిదా వేసింది.