రాష్ట్రీయం

చట్టమే గీటురాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 14: ‘దేశంలో ఇతర రాష్ట్రాలు విడిపోయి కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఏ నిబంధనలు పాటించారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు కూడా అలాగే పాటించాలి’ అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. ‘ఏమైనా సమస్యలు తలెత్తితే రెండు రాష్ట్రాలు పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలి.అలా సాధ్యం కానీ పక్షంలో కేంద్రం జోక్యం చేసుకుంటుంది. అప్పుడు కూడా పరిష్కారం కాకుంటే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నా యి’ అని కెసిఆర్ అన్నారు. తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఆర్టీసి ఆస్తుల పంపకంపై శుక్రవారం విజయవాడలో ఇరు రాష్ట్రాలు సమావేశం కానున్న నేపథ్యంలో తెలంగాణ వైఖరి ఎలా ఉండాలనే దానిపై ప్రగతి భవన్‌లో అధికారులకు ముఖ్యమంత్రి మార్గదర్శకం చేశారు. రవాణాశాఖ మంత్రి పి మహేందర్‌రెడ్డి, రవాణశాఖ ముఖ్య కార్యదర్శి సునిల్ శర్మ, టిఎస్‌ఆర్టీసి మేనేజింగ్ డైరెక్టర్ రమణారావు తదితరుల విజయవాడకు వెళ్లనుండటంతో వారికి ముఖ్యమంత్రి
పలు సూచనలు చేశారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాలనే తెలంగాణ రాష్ట్ర వౌలిక విధానానికి అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో విభజన సమస్యలను విజ్ఞతతో పరిష్కరించుకుందామని ముఖ్యమంత్రి అన్నారు. దేశ అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంటు చేసిన విభజన చట్టం మేరకే ఏ వివాదమైనా పరిష్కారం కావాల్సి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన అనేది ఒక వాస్తవం. ముందు ఈ వాస్తవాన్ని అంతా అంగీకరించాలి, విజ్ఞతతో ఎవరి పాలన వారు చేసుకోవాలని ముఖ్యమంత్రి హితవు పలికారు. ఎవరి సంస్థలు వారు నడుపుకోవాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో ఎపిఎస్‌ఆర్టీసి విభజన కూడా జరుగాలన్నారు. రాష్ట్ర విభజనకు వర్తించిన నిబంధనలే ఆర్టీసి విభజనకు వర్తిస్తాయన్నారు. పార్లమెంటు చేసిన చట్టానికి లోబడే పంపకాలు జరుగుతాయన్నారు. ఈ విషయంలో బోర్డుకు ఎలాంటి అధికారం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని విజయవాడలో జరిగే సమావేశంలో వెల్లడించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.

చిత్రం..విజయవాడలో శుక్రవారం ఆర్టీసి ఆస్తుల పంపకంపై జరుగనున్న సమావేశంపై రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి,
రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునిల్ శర్మ, టిఎస్‌ఆర్టీసి ఎండి రమణారావు తదితరులతో చర్చిస్తున్న సిఎం కెసిఆర్