రాష్ట్రీయం

ఆలయాలకు మహర్దశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 14: తెలంగాణలోని దేవాలయాలకు ‘స్వర్ణయుగం’ రాబోతోంది. దశాబ్దాల నుండి పరిష్కారం కాని సమస్యలకు శుక్రవారం పరిష్కారం లభించబోతోంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నేతృత్వంలో ప్రగతిభవన్‌లో శుక్రవారం ప్రధానమైన సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, కొంత మంది పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులు పెద్దఎత్తున పాల్గొంటున్నారు. దేవాదాయ మంత్రి అల్లోళ్ల ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు కెవి రమణాచారి, రెవెన్యూ (ఎండోమెంట్స్) కార్యదర్శి ఎన్. శివశంకర్‌ల వద్ద గత రెండేళ్ల నుండి జరిగిన సమావేశాలకు ముగింపుగా ముఖ్యమంత్రి వద్ద శుక్రవారం సమావేశం జరగబోతోంది. ధార్మిక పరిషత్ ఏర్పాటు, ధూపదీపనైవేద్యాల పథకం (డిడిఎస్) లో మరికొన్ని ఆలయాలను చేర్చడం, దేవాలయాల నిర్వహణ, అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాల అంశాలపై సమగ్రంగా చర్చించేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఆలయా లు, అర్చకుల వేతనాలకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం రూపొందించిన నివేదికపై ముఖ్యమంత్రి ఇప్పటికే సంబంధిత మంత్రులు, అధికారులతో చర్చలు
జరిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సమగ్ర నివేదికను రూపొందించడంలో సంబంధిత ఉన్నతాధికారులు గురువారం రోజంతా శ్రమించారు. కె.వి. రమణాచారి వద్ద కూడా సమావేశం జరిగింది. ఉమ్మడిగా రూపొందిస్తున్న నివేదికలపై ముఖ్యమంత్రి శుక్రవారం సమగ్రంగా చర్చలు జరుపుతారు. ఈ సమావేశానికి దాదాపు 1000 మంది వరకు అర్చకులు హాజరు కావచ్చని అంచనావేస్తున్నారు.
ఎండోమెంట్స్ శాఖలో ధార్మిక పరిషత్ అత్యంత కీలకమైంది. ధార్మిక పరిషత్ ఏర్పడితే దేవాదాయ శాఖ పరిపాలనను ఒక గాడిలో పెట్టవచ్చని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు తెలిసింది. ధార్మిక పరిషత్ ఏర్పాటు గత మూడేళ్లుగా పెండింగ్‌లో ఉంటూ వస్తోంది. ఇప్పుడు ఈ అంశంపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ధార్మిక పరిషత్ ఏర్పాటైతే అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాలు ఈ పరిషత్ ద్వారా ఇవ్వాలని భావిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ట్రెజరీ ద్వారా వేతనాలు ఇవ్వడం చట్టపరంగా కుదరకపోవడంతో ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వేతనాలు ఇవ్వాలని భావిస్తున్నారు. ప్రసుతం దాదాపు 3,500 మంది అర్చకులకు సాధారణ వేతనాలు లభిస్తున్నాయి. వీరితో పాటు మరో 1800 మంది అర్చకులకు డిడిఎస్ ద్వారా ఆరువేల రూపాయలు లభిస్తున్నాయి. కొత్తగా డిడిఎస్ పథకంలోకి ఇంకో 3000 ఆలయాలను తీసుకురావాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు తెలిసింది. అంటే దాదాపు 8000 మందిపైగా అర్చకులకు ధార్మిక పరిషత్ ద్వారా వేతనాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దూపదీప నైవేద్య పథకం కింద ఇప్పటి వరకు ఇస్తున్న నిధుల మొత్తాన్ని గణనీయంగా పెంచే అవకాశం ఉంది. మొత్తం మీద ముఖ్యమంత్రి నేతృత్వంలో శుక్రవారం ప్రగతిభవన్‌లో జరగబోయే సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు.