రాష్ట్రీయం

పెట్టుబడుల్లో ఫస్ట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 14: తెలంగాణ నిజంగా బంగారమే. దేశంలో యువ రాష్ట్రం గా పేరున్న తెలంగాణలో పెట్టుబడుల వరద ప్రారంభమైంది. రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక, ఐటి విధానాల వల్ల ఆర్ధికాభివృద్ధిరేటును పెంచుకుంది. పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ రాష్ట్రం దక్షిణాది రాష్ట్రాల్లో అగ్రగామిగా నిలిచింది. ఆంధ్ర, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకంటే 79 శాతం ఎక్కువగా పెట్టుబడులు తెలంగాణకు తరలి వచ్చాయి. దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి తెలంగాణ పారిశ్రామిక విధానాలే కారణమని అసోచామ్ అనే పారిశ్రామిక అత్యున్నత మండలి ప్రకటించింది. 2012-17 మధ్య తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చిన తీరును పరిగణనలోకి తీసుకున్నట్లు అసోచామ్ సెక్రటరీ జనరల్ డిఎస్ రావత్, సీనియర్ మేనేజింగ్ కమిటీ సభ్యుడు బాబూలాల్ జైన్ తెలిపారు. జాతీయ స్ధాయిలో పెట్టుబడుల సగటురేటు 27 శాతాన్ని తెలంగాణ అధిగమించిందన్నారు. గురువారం ఇక్కడ ఏర్పా టు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ 2012 వరకు తెలంగాణ ప్రాంతానికి రూ. 3.3 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. కాగా గత ఐదు సంవత్సరాల్లో రూ.5.9 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. ఈ సందర్భంగా అసోచామ్ తెలంగాణ ఆర్ధికాభివృద్ధి, పెట్టుబడుల తీరుపై పుస్తకాన్ని ఆవిష్కరించింది. భారతదేశం మొత్తం మీద ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు రూ.177 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇందులో తెలంగాణ వాటా 3.3 శాతమని రావత్ తెలిపారు. తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రంగా 2014 జూన్ 2వ తేదీన అవతరించింది. గత మూడేళ్లలో పెట్టుబడులు ఆకర్షణకు సంబంధించి జాతీయ సగటు రేటు 20.8 శాతం ఉండగా, తెలంగాణ 68.5 శాతంతో ముందంజలో ఉంది. గత మూడేళ్లలో ప్రతి ఏడాది తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులను సాధించడంలో రికార్డును నెలకొల్పింది. ఇరిగేషన్ సెక్టార్‌లో పెట్టుబడులు 28శాతం, ఆర్ధికేతర సేవల రంగంలో 25 శాతం, విద్యుత్ రంగంలో 18.5 శాతం, తయారీ రంగంలో 11 శాతం పెట్టుబడులు వచ్చాయి.
తెలంగాణలో రూ.4 లక్షల కోట్ల పెట్టుబడితో చేపట్టిన 370 ప్రాజెక్టులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. వచ్చిన పెట్టుబడులతో శరవేగంగా నిర్మాణమవుతున్న ప్రాజెక్టులు విద్యుత్ రంగంలో ఉన్నాయి. ఈ పెట్టుబడులతో 85 శాతం విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. ఆ తర్వాత ఆర్ధికేతర రంగం, మైనింగ్, ఇరిగేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలు ఉన్నాయి.
తెలంగాణ జివిఏ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్) నాలుగు శాతానికి పైగా ఉంది. గత మూడేళ్లలో దేశ ఆర్ధికాభివృద్ధిరేటు 5.4 శాతం నుంచి 6.6 శాతానికి పెరిగింది. కాగా తెలంగాణా ఆర్ధికాభివృద్ధిరేటు 2.7 శాతం నుంచి 8.5 శాతానికి పెరిగింది. రాష్ట్రంలో జనాభా 3.5 కోట్లు ఉంది. ఇందులో 55 శాతం మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. 2016-17లో తెలంగాణ వ్యవసాయ సంబంధిత రంగాల్లో వృద్ధిరేటు 15 శాతం సాధించింది. అంతకు ముందు ఏడాది వర్షాభావం వల్ల కొంత మేరకు ప్రతికూల వృద్ధిరేటు నమోదైంది. సేవా రంగంలో తెలంగాణ దూసుకుపోతోంది. 2013లో వృద్ధిరేటు 8.4 శాతం ఉండగా, 2017కు 10 శాతానికి పెరిగింది. రాష్ట్రంలో మూడుశాతం జనాభా పారిశ్రామిక ఉత్పత్తిలో ఉన్నారు. 2015లో పారిశ్రామిక వృద్ధిరేటు 10 శాతం మందగింజగా, ఆ తర్వాత సంవత్సరం 10 శాతం వృద్ధిరేటును నమోదు చేసింది.
ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో పనులు చేపట్టాలని, వ్యవసాయ రంగంపై 55 శాతం మంది ఆధారపడి ఉండడం వల్ల వారి జీవిత వికాసానికి చర్యలు తీసుకోవాల్సి ఉందని అసోచామ్ సిఫార్సు చేసింది. ఉపాధి కల్పించే పారిశ్రామిక రంగం అభివృద్ధికి ఇతోధికంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. బయో టెక్నాలజీ, సోలార్ ఎనర్జీ ఇతర రంగాల్లో మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలని, పెట్టుబడులను ఆకర్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అసోచామ్ సిఫార్సు చేసింది.