రాష్ట్రీయం

దేశంలోనే మనం టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 15: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం, లైన్ల నష్టాలు తగ్గించుకోవడం, వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ అందించడంలో ఏపీ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఎపిఈపిడిసిఎల్) ప్రథమ స్థానంలో నిలుస్తోందని సంస్థ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ హెచ్‌వై దొర స్పష్టం చేశారు. సంస్థ కార్పొరేట్ కార్యాలయం ఛాంబర్‌లో శుక్రవారం సిఎండిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మిగులు విద్యుత్‌లోను ఇది ముందంజలో నిలిచిందన్నారు. ఈ విధమైన మిగులు విద్యుత్‌ను అవసరాన్నిబట్టి వినియోగిస్తామన్నారు. పరిశ్రమలకు తగిన ప్రోత్సాహం ఉంటుందన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా కోరిన వెంటనే కనెక్షన్లు మంజూరు చేయడం, అంతరాయాల్లేని విద్యుత్ సరఫరా అందివ్వడం చేస్తామన్నారు. ఏపీలోనే అతి పెద్ద భూగర్భ విద్యుద్దీకరణ ప్రాజెక్ట్ ఈపిడిసిఎల్‌కు వచ్చిందన్నారు. టెండర్ల ఖరారు రెండు దశల్లో నిర్వహించి ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభమవుతున్నాయన్నారు. 2019నాటికి దీనిని పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఏపీఎస్‌ఈబి నుంచి డిస్కం వరకు క్షేత్రస్థాయి నుంచి పనిచేసిన తనకు సంస్థ భౌగోళిక పరిస్థితులపై అవగాహన ఉందన్నారు. అందువల్ల పక్కా నెట్‌వర్క్‌తో ముందుకు వెళ్ళాలనేది లక్ష్యంగా పేర్కొన్నారు. 35 ఏళ్ళ విద్యుత్ రంగంలో ఉన్న అనుభవం, ఉద్యోగులు, అధికారులతో సమన్వయం ఏర్పర్చుకుని లక్ష్యాల సాధనకు కృషి చేస్తామన్నారు. ఇప్పటి వరకు అనేకమంది
సిఎండిలు సంస్థకు, వినియోగదారులకు చేసిన మంచి పనులు తాను ముందుకు తీసుకువెళ్తానన్నారు. సోలార్ పవర్ ప్రాజెక్టులు ఏపీలో పలుచోట్ల అందుబాటులోకి వచ్చాయన్నారు. ఏపీఈపిడిసిఎల్ పరిధిలో ఎక్కువుగా రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్టులకు ఆదరణ లభిస్తోందన్నారు. క్షేత్రస్థాయిలో లైన్లమెన్ల కొరత ఉందని, అయితే వినియోగదారుని సేవలపై దీని ప్రభావం పడటం లేదన్నారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్లు, సిజిఎంలు, ఆయా జిల్లాల ఎస్‌ఇలు, కార్మిక సంఘాల ప్రతినిధులు సిఎండి దొరకు అభినందనలు తెలియజేశారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎపి ఈపిడిసిఎల్ సిఎండి హెచ్‌వై దొర