రాష్ట్రీయం

శ్రీశైలంలో పెరిగిన వరద ఉధృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 17: తెలంగాణలో గత రెండురోజుల నుండి ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాగర్‌కర్నూలు జిల్లాలోని అచ్చంపేట ప్రాంతంలో గత 24 గంటల్లో భారీ వర్షం కురిసింది. ఈ జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కొద్దిపాటి వర్షాలు కురిశాయి. వాస్తవంగా నాగర్‌కర్నూలు జిల్లాలో ఈ సీజన్‌లో అతితక్కువ వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం కురిసిన వర్షాలు మెట్టపంటలకు ఉపయోగపడే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. నైరుతీ రుతుపవనాల వల్ల ఇప్పటి వరకు పెద్దపల్లి జిల్లాలోని కమాన్‌పూర్ మండలంలో అతితక్కువ వర్షపాతం నమోదైంది. హైదరాబాద్, జోగులాంబ గద్వాల జిల్లాలో సాధారణం కన్నా అధికంగా వర్షాలు కురవడం గమనార్హం. ఈ రెండు జిల్లాల్లో సాధారణం కంటే 20 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. కొమురంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్నసిర్సిల్లా, మెదక్, వికారాబాద్ జిల్లాల్లో సాధారణం కన్నా 20 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. మిగతా జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.
కర్నాటక రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల వల్ల జూరాల, శ్రీశైలం జలాశయాలలోకి భారీగా నీరు చేరుతోంది. తాజా సమాచారం ప్రకారం జూరాలకు 1,13,326 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి 1,53,563 క్యూసెక్కుల నీరు చేరుతోంది. గత మూడు రోజుల్లో దాదాపు 50 టిఎంసిల నీరు శ్రీశైలం జలాశయానికి చేరింది. దాంతో 215 టిఎంసిల సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 77 టిఎంసిల నీరు ఉంది. కృష్ణా ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు పూర్తిగా నిండటంతో అదనపు నీటిని కిందికి వదిలివేస్తున్నారు. నారాయణపూర్-జూరాల మధ్య కూడా గత రెండురోజులపాటు కురిసిన వర్షాల వల్ల జూరాలకు వరదపోటెత్తింది. శ్రీశైలానికి చేరుతున్న నీటి ప్రవాహం ఇలాగే చేరితే మరో నాలుగైదు రోజుల్లో వంద టిఎంసిలకు చేరవచ్చని భావిస్తున్నారు. కర్నాటకలో వర్షాలు బాగా ఉంటే శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలు నిండే అవకాశం ఉంది. అయితే ఎంత కాలం కృష్ణాలోకి కర్నాటక నుండి వరద ప్రవాహం వస్తుందో ఇప్పటికిప్పుడే అంచనావేసేందుకు వీలు కాదు. శ్రీశైలంలోకి వస్తున్న నీటి వినియోగానికి కృష్ణాబోర్డు సమావేశం ఈ వారంలో నిర్వహిస్తున్నారు. పస్తుతం అందుబాటులో ఉన్ననీరు, భవిష్యత్తు పరిస్థితిని పరిశీలించి, నీటి వినియోగానికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారని తెలసుస్తోంది. పంపకాలు ఎలా చేస్తారన్న అంశంపై ఇరు రాష్ట్రాల ప్రజలు, రైతుల ఎదురు చూస్తున్నారు.