రాష్ట్రీయం

తల్లి పాలు ఎంతో.. మాతృభాషా అంతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 17: మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరిట ఏటా ప్రదానం చేస్తున్న జాతీయ అవార్డును దర్శకుడు ఎస్‌ఎస్ రాజవౌళి అందుకున్నారు. హైదరాబాద్ శిల్ప కళావేదికలో ఆదివారం సాయంత్రం జరిగిన ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా భారత ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు, సిఎం కెసిఆర్ హాజరై అవార్డును రాజవౌళికి అందజేశారు. కార్యక్రమంలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అక్కినేని అవార్డు రాజవౌళి అందుకోవడం అభినందనీయమన్నారు. అన్ని పాఠశాలల్లో తెలుగు మీడియం ఉండాలని ఆకాంక్షిస్తూ, తెలుగు భాషను తప్పనిసరి చేసిన సిఎం కెసిఆర్‌ను
అభినందించారు. తల్లి పాలు ఎంత శ్రేష్ఠమో, మాతృభాషా అంతే శ్రేష్ఠమని, తెలుగు భాష మాధుర్యాన్ని భవిష్యత్ తరాలకూ అందించాలని సూచించారు. సిఎం కెసిఆర్ దర్శకుడు రాజవౌళిపై పొగడ్తల వర్షం కురిపించారు. ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన దర్శకుడు రాజవౌళికి అరుదైన అక్కినేని అవార్డు అందించటం ముదావహమన్నారు. రాజవౌళి సృష్టించిన ‘బాహుబలి’ని అద్భుత కళాఖండంగా అభివర్ణించారు. అక్కినేని జీవితం అందరికీ ఆదర్శప్రాయం అంటూ, ఆయన తన ప్రతిభతో తెలుగు సినిమా స్థాయిని పెంచారని కీర్తించారు. ఏఎన్నార్ ఎదుగుతూ పరిశ్రమను పెంచారని, చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కు రావడంలో ఆయన కృషి ఎంతో ఉందన్నారు. సినీ పరిశ్రమకు తన ప్రభుత్వం నుంచి అన్నివిధాలా సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. అవార్డు అందుకున్న అనంతరం దర్శకుడు రాజవౌళి మాట్లాడుతూ మరణాన్ని శాసించిన మహానుభావుడు అక్కినేని పేరిట తీసుకున్న ఈ అవార్డుకు తాను అర్హుడినేనా? అని ప్రశ్నించుకున్నారు. అనేకసార్లు గుండెపోటు వచ్చినా తాను రమ్మన్నప్పుడే మృత్యువు రావాలని శాసించిన వ్యక్తిగా తనకు అక్కినేని కనిపిస్తారని, అటువంటి వ్యక్తులు తనకు తెలిసి మహాభారతంలో భీష్మాచార్యులు వంటి గొప్పవారు ఉన్నారని కీర్తించారు. ఈ కలియుగంలో అంత గొప్ప వ్యక్తిగా అక్కినేని కనిపిస్తారని, ఇలాంటి అవార్డులు తీసుకున్నప్పుడు అందరూ కలిసి తనకు రెక్కలు కట్టినట్టుగా భావిస్తానని అన్నారు. అవార్డును తీసుకున్నందుకు బాధ్యతగా మంచి సినిమాలను అందించే ప్రయత్నం చేస్తానని, అవార్డుకు మరింత గౌరవం తెచ్చేందుకు శాయశక్తులా కష్టపడతానని రాజవౌళి ప్రామిస్ చేశారు. అవార్డు ఇచ్చి నాగార్జున తనపై పెద్ద్భారాన్ని మోపారని రాజవౌళి చమత్కరించారు. రాష్ట్రంలో ఇంటర్ వరకు తెలుగు భాష తప్పని సరి చేస్తూ తెలంగాణ సిఎం కెసిఆర్ తీసుకున్న నిర్ణయానికి రాజవౌళి హర్షం వ్యక్తం చేశారు. నాగార్జున మాట్లాడుతూ ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి కెసిఆర్ అని, ప్రజలను ఎలా సంతోషపెట్టాలో, వారికి ఏంకావాలో ఆయనకు బాగా తెలుసునన్నారు. కెసిఆర్ ప్రజల కోసం ఆలోచించి తలపెట్టిన హరితహారం, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీటి సరఫరా స్కీమ్, డబుల్ బెడ్‌రూం పథకం, రైతులకు రుణ మాఫీ స్కీమ్‌లు ప్రజల కోసమేనని కొనియాడారు. అక్కినేని నాగేశ్వరారవు పేరిట జాతీయ అవార్డు తన తండ్రి బతికి ఉన్నప్పటి నుంచే ప్రదానం చేస్తున్నామని చెప్పారు.

చిత్రం..దర్శకుడు రాజవౌళికి అక్కినేని జాతీయ పురస్కారం అందిస్తున్న
ఉప రాష్టప్రతి వెంకయ్య, సిఎం కెసిఆర్. చిత్రంలో నాగార్జున తదితరులు