రాష్ట్రీయం

కేసును తప్పుదారి పట్టించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: సంచలనం సృష్టించిన ఆయేషా మీర హత్య కేసును పోలీసులు తప్పుదారి పట్టించారని ఆమె తల్లిదండ్రులు సోమవారం నాడు హైకోర్టులో పేర్కొన్నారు. తాత్కాలిక ప్రధానన్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధన్, జస్టిస్ జె ఉమాదేవిలతో కూడిన డివిజన్ బెంచ్ ముందు ఆయేషా తల్లిదండ్రులు ఇక్బాల్ బాషా, శంషాద్ బేగంలు హాజరయ్యారుఈ మేరకు వారి వాదనను న్యాయవాది డి సురేష్‌కుమార్ డివిజన్ బెంచ్ ముందు వినిపించారు. ఉస్మానియా యూనివర్శిటీకి చెందిన రమామెల్కోటే దాఖలు చేసిన పిటీషన్‌తో పాటు హైకోర్టు రెండు పిటీషన్లను విచారిస్తోంది. ఆయేషా మీర హత్యకేసును పున:విచారణ జరిపించాలని సురేష్‌కుమార్ పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడు పి సత్యంబాబు నిర్దోషిగా హైకోర్టు తేల్చిన క్రమంలో అసలు దోషిని గుర్తించాలని ఆయన కోరారు. హాస్టల్‌లో ఉన్న వార్డెన్‌కు, సహచరులకు ఆమె హత్య సమాచారం లేదని చెప్పడం ద్వారా అనుమానాలకు తావిస్తోందని ఆయన వాదించారు. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రిత్వశాఖ వాదన తర్వాత విచారణ కొనసాగిస్తామని హైకోర్టు న్యాయమూర్తులు పేర్కొన్నారు.