రాష్ట్రీయం

హైకోర్టుకు ఆరుగురు న్యాయమూర్తుల నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి హైకోర్టుకు ఆరుగురు న్యాయమూర్తులను నియమిస్తూ రాష్టప్రతి రామ్‌నాధ్ కోవింద్ సోమవారం ఆమోద ముద్ర వేశారు. కొత్తగా డివిఎస్‌ఎస్ సోమయాజులు, పొట్లపల్లి కేశవరావు, మంతోజు గంగారావు, అభినంద్ కుమార్ షావిలి, తొడుపునూరి అమర్‌నాథ్ గౌడ్, కొంగర విజయలక్ష్మిలను న్యాయమూర్తులుగా నియమించారు. ఈ నెల 21న కొత్త న్యాయమూర్తులు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని తెలిసింది. వివిధ హైకోర్టుల్లో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టుల భర్తీకి సుప్రీంకోర్టు కొలీజియం 61 పేర్లను పరిశీలించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి, కొత్తగా నియమితులైన వారితో కలిపితే హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరింది. సోమయాజులు 1961 సెప్టెంబర్‌లో జన్మించారు. ఆయన 1988 నుండి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. విశాఖపట్టణం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. వరంగల్ జిల్లా పెద్దపెండ్యాలకు చెందిన కేశవరావు 1961 మార్చిలో జన్మించారు. 1982లో ఆయన న్యాయవిద్యను అభ్యసించారు. 1986 నుండి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. గంగారావు అనంతపురం జిల్లా గుంతకల్‌కు చెందిన వారు. ఆయన 1961 ఏప్రిల్‌లో జన్మించారు. 1988 నుండి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అమర్‌నాథ్ గౌడ్ 1965 మార్చిలో జన్మించారు. 1990లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు.

చిత్రాలు..అభినంద్ కుమార్* అమర్‌నాథ్ గౌడ్* సోమయాజులు *గంగా రావ్ *కేశవరావు *విజయలక్ష్మి