రాష్ట్రీయం

ఎన్‌హెచ్‌పై కారు దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆళ్లగడ్డ, సెప్టెంబర్ 18: కర్నూలు జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 40వ నెంబరు జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి బోల్తా పడటంతో మంటలంటున్నాయి. దీంతో కారులో ఉన్న మహిళ, ఇద్దరు చిన్నారులు కాలిబూడిదైపోయారు. మృతులు కడప జిల్లా ప్రొద్దుటూరు వాసులు. పోలీసుల కథనం ప్రకారం ప్రొద్దుటూరుకు చెందిన అన్నదమ్ములు నాగరాజు, రాజా డ్రైవర్లు. నాగరాజు భార్య వనితాబాయి (23) తన ఇద్దరు కుమారులు ప్రేమ్‌కుమార్ (5), ఉమేష్ (3), మరిది రాజాతో కలిసి నంద్యాలలోని అత్త వద్దకు ఆదివారం రాత్రి కారులో బయలుదేరింది. రాజా కారు నడుపుతున్నాడు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం బత్తలూరు సమీపంలోకి రాగానే 40వ నెంబరు జాతీయ రహదారిపై మట్టి దిబ్బలున్న చోట కారు అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో డ్రైవర్ సీటులో ఉన్న రాజా ఎగిరి బయటపడ్డాడు. తీవ్రంగా గాయపడి సృహకోల్పోయాడు. షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా చెలరేగిన మంటలు కారును చుట్టుముట్టాయి. దీంతో కారులోనే ఉండిపోయిన వనితాబాయి, చిన్నారులు ప్రేమ్‌కుమార్, ఉమేష్ సజీవ దహనమయ్యారు. అదేమార్గంలో వెళ్తున్న వాహనదారులు సమాచారం అందించడంతో ఆళ్లగడ్డ సిఐ దస్తగిరిబాబు హుటాహుటిన సిబ్బందితో కలిసి సంఘటనా స్ధలానికి చేరుకునేసరికి కారు పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చి చూడగా కారులో మహిళ, ఇద్దరు పిల్లల మృతదేహాలు కనిపించాయి. ప్రమాదం జరిగినప్పుడు తల్లీబిడ్డలు గాయపడి కారులో ఉండిపోవడంతో మంటల నుంచి బయటకు రాలేక పోయారా? లేక మంటలంటుకోవడంతో వాటిలో చిక్కి సజీవ దహనమయ్యారా? అన్నది తేలాల్సి ఉంది. తీవ్రంగా గాయపడిన రాజాను చికిత్స నిమిత్తం నంద్యాల వైద్యశాలకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వనితాబాయి భర్త నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామని సిఐ తెలిపారు. తల్లీబిడ్డలు సజీవదహనం కావడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

చిత్రం..అర్ధరాత్రి తగులబడుతున్న కారు