రాష్ట్రీయం

మరీ ఇంత నీచమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: ప్రతిపక్షాలు చౌకబారు రాజకీయాలకు పాల్పడటం చూసాం కానీ మరీ చీరలను తగులబెట్టేంత కుసంస్కారానికి దిగజారి నీచ, నికృష్ట రాజకీయాలకు వడిగట్టడం దారుణమని చేనేతశాఖ మంత్రి కె తారకరామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే రోజు 10 వేల కేంద్రాలలో 25 లక్షల చీరల పంపిణీ జరిగితే, నాలుగైదు చోట్ల ఇతరుల ప్రోద్భలంతో చీరలు కాల్చితే ఏదో జరిగిపోయినట్టు విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. రాష్టవ్య్రాప్తంగా సోమవారం ప్రారంభమైన బతుకమ్మ చీరల పంపిణీలో చీరలు నాసిరకంగా ఉన్నాయని అక్కడక్కడ జరిగిన నిరసనలపై మంత్రి తీవ్రంగా స్పందించారు. సచివాలయంలో చేనేతశాఖ అధికారులతో కలిసి మంత్రి కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ నేత కార్మికులకు ఉపాధి కల్పించడం, బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు కానుకగా చీరలు ఇవ్వాలన్న సద్దుదేశాన్ని కూడా రాద్ధాంతం చేస్తామంటే ఈ సన్నాసులను ఏమనాలని నిప్పులు చెరిగారు. ప్రభుత్వం ఎంత మంచి పని చేసినా ఓర్చుకోలేని దుస్థితికి ప్రతిపక్ష పార్టీలు దిగజారని అన్నారు. బతుకమ్మ పండుగ కానుకగా ఆడపడుచులకు చీరలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కెసిఆర్ మంచి ఆలోచన చేస్తే కాంగ్రెస్, టిడిపిలు కడుపుమంటతో ప్రభుత్వంపై బట్టకాల్చి మీద వేయడానికి ప్రయత్నిస్తున్నాయని మంత్రి దుయ్యబట్టారు. రాష్టవ్య్రాప్తంగా కేవలం నాలుగు, ఐదు చోట్ల చీరలు నాసిరకంగా ఉన్నాయని జరిగిన ఘటనల వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉందన్నారు. వారం రోజుల కిందటనే చీరలు నాసిరకంగా ఉన్నాయంటూ సోషళ్ మీడియాలో కథనాలు రావడం వెనుక విపక్షాల కుట్ర ఉందన్నారు. బతుకమ్మ నుంచి ఒక పూవ్వు కూడా కిందపడనీయని ఆడపడుచులు చీరలను తగులబెడుతారా? అని మంత్రి ప్రశ్నించారు. చీర ఇష్టం లేకపోతే తీసుకోకపోవచ్చు, తీసుకున్నా నచ్చకపోతే పని మనిషికి ఇస్తారు, లేకపోతే పక్కన బెడుతారు కానీ ఎవరు కాల్చి వేయరన్నారు. జగిత్యాల, ఖమ్మం జిల్లాల్లోనే ఈ సంఘటనలు జరిగాయంటే వీటి వెనుక ఎవరున్నారో ఇట్టే అర్థమైపోతుందన్నారు. రాష్టవ్య్రాప్తంగా 10 వేల కేంద్రాలలో చీరల పంపిణీ జరిగితే అందులో కేవలం ఐదారు కేంద్రాలలో జరిగిన వాటినే మీడియా హైలెట్ చేయడం తగదని మంత్రి హితవు పలికారు. చీరల నాణ్యతలో ఎక్కడా రాజీపడలేదని, అధికారులు జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు పరిశీలించి, ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఎంతో కష్టపడి చేసిన మంచి పనిని ప్రశంసించకపోగా బురదజల్లడం ఎవరికీ మంచి కాదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడైనా లోటు పాట్లు జరిగితే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. చేనేతశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యార్ మాట్లాడుతూ, చీరల నాణ్యతలో ఎలాంటి లోపం లేదన్నారు. సూరత్ నుంచి కొనుగోలు చేసిన చీరలను కూడా టెండర్ల ద్వారా సేకరించామన్నారు. ఇలా ఉండగా బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయని, నేత చీరలని చెప్పి సూరత్ నుంచి కిలోల లెక్కన కొని పంచారని పలుచోట్ల మహిళలు నిరసనలకు దిగారు. చీరలు తీసుకోవడానికి ఒక రోజు కూలి మానేసామని, అయితే కూలి డబ్బుల కంటే చీరలు చౌకగా ఉన్నాయని నిరసనకారులు ఆరోపించారు. చీరలు నాసిరకంగా ఉన్నాయని అక్కడక్కడ వాటిని తగులబెట్టిన సంఘటనలు పూర్వ కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లోనే చోటు చేసుకోవడం, పైగా ఇవీ విపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధుల నియోజకవర్గాలు కావడం విశేషం.

చిత్రం..సిరిసిల్ల సెగ్మెంట్‌లోని ముస్తాబాద్‌లో బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్న మంత్రి కెటిఆర్