రాష్ట్రీయం

20న నింగిలోకి పిఎస్‌ఎల్‌వి సి-31 ( రేపు కౌంట్‌డౌన్ ప్రారంభం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జనవరి 16: భారత అంతరిక్ష ప్రయోగకేంద్రం ఇస్రో ప్రతిష్టాత్మకంగా నింగిలోకి పంపనున్న సతీష్ థావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి పిఎస్‌ఎల్‌వి సి-31 రాకెట్ ప్రయోగం ఈనెల 20న జరగనుంది. నావిగేషన్ సేవలకు సంబంధించిన శ్రీహరికోట నుంచి నింగిలోకి పంపించేందుకు ఇస్రో ఈరాకెట్ ప్రయోగం చేస్తోంది. రాకెట్ ప్రయోగ ఏర్పాట్లకు సర్వం సిద్ధం చేసింది. ఈ ప్రయోగానికి సంబంధించిన మిషన్ రెడీనెస్ రివ్యూ (ఎంఆర్‌ఆర్) సమావేశం ఆదివారం షార్‌లో డాక్టర్ సురేష్ అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో ప్రయోగంపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఎంఆర్‌ఆర్ అనంతరం షార్ డైరెక్టర్ కున్హికృష్ణన్ ఆధ్వర్యంలో లాంచింగ్ ఆథరేజైషన్ బోర్డు సమావేశమై ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. ఈ రాకెట్ ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎఫ్-1ఇ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. షార్‌లోని తొలి ప్రయోగ వేదిక వద్ద ఇప్పటికే రాకెట్ నాలుగు దశల అనుసంధాన పనులు పూర్తయి చివరి భాగంలో ఉపగ్రహాన్ని అమర్చే ప్రక్రియను శాస్తవ్రేత్తలు పూర్తి చేశారు. నావిగేషన్ సేవలకు సంబంధించిన ఈ ప్రయోగాన్ని ఇస్రో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రవేశపెడుతోంది. ఇప్పటికే ఈ సీరిస్‌లో నాలుగు ప్రయోగాల్ని విజయవంతం ప్రయోగించారు. నావిగేషన్ సిరీస్‌లో ఇది ఐదో ప్రయోగం కావడం గమనార్హం. దీని విజయవంతంతో నావిగేషన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ ప్రయోగానికి 48గంటల ముందు అనగా సోమవారం ఉదయం 9.31గంటలకు ప్రారంభిస్తున్నారు. కౌంట్‌డౌన్ సజావుగా సాగి వాతావరణం అనుకూలిస్తే ఈనెల 20వ తేదీ ఉదయం 9.31గంటలకు పిఎస్‌ఎల్‌వి సి-31 రాకెట్ షార్‌లో తొలి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. ఆదివారం జరిగే ఎంఆర్‌ఆర్ సమావేశం అనంతరం ఇస్రో అధికారికంగా ప్రకటించనుంది.

చిత్రం... షార్‌నుంచి 20న పంపనున్న
రాకెట్‌లో ఐఆర్‌ఎన్‌ఎస్ -1 ఇ ఉప్రగహం