రాష్ట్రీయం

చితి పేర్చుకున్నారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, సెప్టెంబర్ 18: పెద్దోడి వ్యాపార వ్యాపకం, చిన్నోడి ఉద్యోగ వ్యవహరం.. పచ్చని కుటుంబానికి చితి పేర్చింది. భరించలేని నష్టం, జీర్ణించుకోలేని మోసం ఆ కుటుంబ పెద్దను కుంగదీసింది. బాధను బంధువులతో పంచుకోలేక, ఒడ్డుకు చేరే ఒడుపు దొరకక కుటుంబం మొత్తం బలవన్మరణానికి పాల్పడింది. తల్లిని వేరేచోటికి పంపించి, అప్పులు కొన్ని చెల్లించి, కర్మఖండకు కావాల్సిన డబ్బు ముందే భద్రపర్చి.. కాటికి పయనమైన కుటుంబం కన్నీటి గాధ! పేటవాసులను దుఃఖ సాగరంలోకి నెట్టిన జనార్ధన్ కుటుంబ విషాదాంతం వివరాలు ఇలా ఉన్నాయి. కస్తూరి జనార్ధన్ (56) బిఎస్‌ఎన్‌ఎల్‌లో లైన్‌మెన్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కస్తూరి బజార్‌లో ఉండే జనార్థన్‌కు భార్య చంద్రకళ, ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు సురేష్‌కు ప్రభాతతో వివాహమైంది. వీరికి నాలుగేళ్ల సిరి, రెండేళ్ల రిత్విక పిల్లలున్నారు. చిన్న కుమారుడు అశోక్ (32) తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడు. సురేశ్ మాత్రం వ్యాపారం చేసుకుంటూ రామలింగేశ్వర ధియేటర్ సమీపంలో నివాసం ఉంటున్నాడు. వ్యాపారరీత్యా అప్పుడుప్పుడు హైదరాబాద్‌కు వెళ్లేక్రమంలో భార్య, బిడ్డలను తల్లిదండ్రుల వద్ద ఉంచేవాడు. ఈనెల 11న పుణే వెళ్తున్నానంటూ ఇంటి నుంచి బయలుదేరాడు. వారంనుంచీ పెద్ద కుమారుడి
ఆచూకీ దొరక్కపోగా, ఆయన చేసిన అప్పుల ఉదంతాలు ఒక్కొక్కటి బయటపడ్డాయి. షేర్ మార్కెట్ సాకుతో పెద్ద కొడుకు చేసిన కోట్ల రూపాయల అప్పులు బయటపడటంతో జనార్ధన్‌కు కునుకులేకుండా పోయింది. దీనికితోడు చిన్న కుమారుడు ఉద్యోగ వ్యవహరం రెండేళ్లుగా వేధిస్తూనే ఉంది. కోర్టులో ఉద్యోగం ఇప్పిస్తామంటూ జనార్ధన్‌ను ఓ వ్యక్తి చేసిన మోసం నకిలీ నియమాకపత్రంతో 14 లక్షల రూపాయలు పోగొట్టుకున్న వైనం ఆయనను మరింత కృంగదీసింది. సున్నిత మనస్కుడైన జనార్ధన్ ఈ రెండు ఘటనలతో తట్టుకోలేకపోయాడు. నాలుగైదు రోజులుగా చిల్లరమల్లర బాకీలు తీరుస్తూ కుటుంబం ముభావంగా ఉంటోంది. ఒక నిర్ణయానికి వచ్చిన జనార్ధన్ తల్లి రాములమ్మను నిర్ధాక్షిణ్యంగా ఇంటినుంచి వెళ్లగొట్టి, బంధువర్గంతో సంబంధాలు బెడిసేలా జాగ్రత్తపడ్డాడు. చివరకు ఆదివారం రాత్రి ఇంటిల్లిపాదీ క్రిమిసంహార మందు సేవించారు. జనార్ధన్‌తోపాటు ఆయన భార్య చంద్రకళ (50), చిన్న కొడుకు అశోక్ (32), కోడలు ప్రభాత (30), మనమరాళ్లు సిరి (4), రిత్విక (2) నిద్రలోనే శాశ్వతంగా కన్నుమూశారు. సోమవారం తెల్లవారుజామున పాలు పోసేందుకు వచ్చిన వ్యక్తి తలుపుకొట్టగా ఎవ్వరూ బయటకు రాకపోవడంతో కిటికీ అద్దాలు పగులగొట్టి చూడటంతో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న స్ధానికులు పెద్దసంఖ్యలో ఘటనా స్థలికి చేరుకున్నారు. ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులు సహా కుటుంబ సభ్యుల మృతదేహాలను చూసి కన్నీళ్లపర్యంతమయ్యారు. ఘటనా స్ధలాన్ని జిల్లా ఎస్పీ జె ప్రకాశ్ జాదేవ్, డిఎస్పీ ఎం నాగేశ్వర్‌రావులు సందర్శించారు. ఘటనా స్థలిలో లభ్యమైన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరువుపోతుందన్న భయంతోనే కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్టుగా భావిస్తున్నామని, సూసైడ్‌నోట్ ఆధారంగా బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. సంఘటనపై సూర్యాపేట డిఎస్పీ నాగేశ్వర్‌రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు ఏరియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం బంధువులకు అప్పగించారు.

చిత్రం.. సూర్యాపేటలో బలవన్మరణానికి పాల్పడిన కస్తూరి జనార్ధన్ కుటుంబం