రాష్ట్రీయం

స్పెషల్ బాక్స్ ఉంది.. జాగ్రత్త!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: చిన్నపిల్లలపై లైంగికపరమైన వేధింపులకు సంబంధించిన సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఆ అంశంపై దృష్టిసారించింది. పిల్లలపై పెరిగిపోతున్న లైంగిక వేధింపులకు తెరదించే ఏర్పాట్లు చేసింది. వివిధ ప్రదేశాల్లో పిల్లలపై జరుగుతున్న వేధింపులపై రహస్యంగా సమాచార సేకరణ ప్రారంభించింది. ఇందుకో వెబ్‌సైట్ పెట్టింది. అందులో ఆటస్థలం, పాఠశాల, బ్లాక్ మెయిల్, బస్సుల్లో, వాహనాల్లో జరుగుతున్న వేధింపులు, కుటుంబ సభ్యుల ద్వారా ఎదురవుతున్న వేధింపులు, ఇంటర్‌నెట్, ఫోన్ ద్వారా ఎదురయ్యే వేధింపులపై సమాచార సేకరణ జరుపుతారు. ఆ డాటా రాగానే సంబంధిత అధికారులు సమీపంలోని పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇస్తారు. వెంటనే పోలీసులు తదనుగుణ చర్యలు చేపడతారు. ఇందుకోసం కేంద్రం 9868235077, 1098 అనే నెంబర్లను చైల్డ్ లైన్ కోసం ఏర్పాటు చేశారు. మరోపక్క పాఠ్యపుస్తకాల్లోనూ లైంగిక దాడులకు సంబంధించిన సూచనలు, జాగ్రత్తలు పొందుపర్చనున్నారు. ఈమేరకు వచ్చే విద్యాసంవత్సరం నుండి లైంగిక దాడుల గురించి పిల్లల్లో అవగాహన పెంచేందుకు సూచనలు, లైంగిక దాడి జరిగే విధానాలు, జాగ్రత్తలతో పాటు అత్యవసర ఫోన్ నెంబర్లు, లైంగిక దాడి నేరాలకు సంబంధించి చట్టాల వివరాలను పాఠ్యపుస్తకాల్లో అందించనున్నారు. ఈమేరకు ఎన్‌సిఇఆర్‌టి ఏర్పాట్లు చేస్తోంది. దీనివల్ల పిల్లల్లో సభ్య స్పర్శ, అసభ్య స్పర్శ మధ్య తేడాలు కూడా తెలుస్తాయని ఎన్‌సిఇఆర్‌టి అధికారులు చెబుతున్నారు. అలాగే లైంగిక దాడి సమయంలో తీసుకోవాల్సిన రక్షణ చర్యల గురించీ తెలుస్తుందని పేర్కొంది. ర్యాన్ స్కూల్‌లో విద్యార్థి హత్య సంఘటన, తర్వాత బాలలపై శారీరక, మానసిక అత్యాచారాలకు సంబంధించిన అంశాలను కూడా పాఠ్యపుస్తకాల్లో పొందుపరచాలని మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ తమకు సూచించిందని ఎన్‌సిఇఆర్‌టి డైరెక్టర్ హృషీకేష్ సేనాపతి చెప్పారు. ఈ విషయాల గురించి పిల్లలకు అవగాహన కల్పించడంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా సహకరించాలని సూచించారు.

చిత్రం..ఆన్‌లైన్‌లో స్పెషల్ బాక్స్ యాప్