రాష్ట్రీయం

గోదావరిపై దృష్టి పెడదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: కృష్ణా పరివాహక ప్రాంతంలో ప్రస్తుతం నీటి కొరత ఏర్పడిన నేపథ్యంలో గోదావరి జలాలు వాడుకునే అవకాశం ఉండేలా ఇంటర్ కనెక్టెడ్ గ్రిడ్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని అధికారులను మున్సిపల్ మంత్రి కె తారకరామారావు ఆదేశించారు. అధ్యయన నివేదికను వారంలో సమర్పించాలన్నారు. జలమండలి, హైదరాబాద్ మెట్రో డవలప్‌మెంట్ అథారిటీ ప్రాజెక్టులపై మంగళవారం అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రెండు నదుల నుంచి వచ్చే జలాలను అనుసంధానించటం వల్ల భవిష్యత్‌లో అవుటర్ రింగ్ రోడ్ పరిధిలోని నగరానికి మంచినీటి సరఫరాలో ఇబ్బంది ఉండదన్నారు. జలమండలి చేపట్టనున్న ఒఆర్‌ఆర్ రింగ్ మెయిన్‌తో ప్రస్తుతం మంజీరా ద్వారా నీరు అందిస్తున్న ప్రాంతాలకు మంచినీటి కష్టాలు తీరుతాయన్నారు. ఈ ప్రాంతాలకు గోదావరి జలాలను అందించేందుకు వీలుగా రింగ్ మెయిన్ పనులను అత్యుత్తమ ప్రమాణాలతో నిర్మించాలన్నారు. పెరిగే జనాభాకు అనుగుణంగా జలమండలి తన ప్రాజెక్టులను విస్తరించుకోవాలన్నారు. హైదరాబాద్ నగర తాగునీటి అవసరాల కోసం ఏర్పాటు చేయనున్న కేశవపూర్ రిజర్వాయర్ ప్రణాళికను అధికారులు మంత్రికి వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా కనీసం 20 టిఎంసి నీరు హైదరాబాద్ నగర మంచినీటి అవసరాల కోసం నిల్వ చేసుకునే అవకాశం కలుగుతుందన్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు, మార్గాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జలమండలి పరిధి పెరుగనున్న నేపథ్యంలో ఉద్యోగుల రేషనలైజేషన్ చేసుకోవాలని సూచించారు. అవసరమైతే ఉద్యోగుల సంఖ్య పెంచుకోవాలన్నారు. హెచ్‌ఎండిఎపై జరిగిన సమీక్ష సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అవుటర్ రింగ్ రోడ్డ్ చుట్టూ ఎల్‌ఇడి లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. పివిఆర్ ఎక్స్‌ప్రెస్ వే, హుస్సెన్‌సాగర్ చుట్టూరా ఎల్‌ఇడి లైట్ల బిగింపు దీపావళికి పూర్తి కావాలన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కారం నెలాఖరుకు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. హెచ్‌ఎండిఎ ఆధీనంలోని చిన్న చిన్న స్థలాలను పారదర్శకంగా వేలం వేయాలన్నారు.

చిత్రం..జలమండలి, హెచ్‌ఎండిఎ ప్రాజెక్టులపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి కెటిఆర్