రాష్ట్రీయం
ఐలయ్యపై సిఐడి కేసు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 20 September 2017
విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 19: ప్రముఖ రచయిత, ప్రొఫెసర్ కంచె ఐలయ్యపై ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. వైశ్యవర్గంపై ఐలయ్య రచించిన పుస్తకం తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. తమ వర్గాన్ని కించపరిచేలా రచనలు ఉన్నాయంటూ వైశ్యులు తీవ్ర ఆందోళనలు కొనసాగిస్తున్న నేపధ్యంలో ఐలయ్యపై కేసు నమోదు చేయాల్సిందిగా సిఐడి పోలీసులను డిజిపి నండూరి సాంబశివరావు ఆదేశించారు. తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా పుస్తకం రాసి కుల, మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారంటూ ఆర్యవైశ్య సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డిజిపి స్పందించారు.