రాష్ట్రీయం

చర్చి పాస్టర్‌కు శిరోముండనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధురవాడ, నవంబరు27: చర్చి పాస్టర్‌కు బలంతంగా శిరోముండనం చేయించిన పాఠశాల డైరెక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మధురవాడ ఎసిపి రవిబాబు శుక్రవారం తెలిపిన వివరాల మేరకు.. 4వ వార్డు పరిధలోని కొమ్మాది కూడలి వద్ద నివాసముంటున్న జి డేనియేల్ భీమిలి మండలం తాటితూరులో గత 15ఏళ్లుగా ఫెయిత్ హోం ప్రేయర్ ఫెల్లోషిప్ పేరున ఒక చర్చి నిర్వహిస్తున్నాడు. ప్రతి ఆది, శుక్రవారాల్లో డేనియల్ తన భార్య, కుమార్తెలతో వెళ్లి అక్కడ ప్రార్థనలు నిర్వహిస్తుంటాడు. చర్చి శిథిలావస్థకు చేరటంతో దాని పునర్నిర్మాణం కోసం విరాళాలు సేకరించాడు. ఇదిలా ఉండగా ఈ నెల 16న కేథరిన్ స్కూల్ డైరెక్టర్ అలీవర్ ఫోన్ చేసి డేనియేల్‌ను తన పాఠశాల వద్దకు రావాలని పిలిచాడు. అక్కడికి వెళ్లిన డేనియేల్‌ను ఎందుకు విరాళాలు సేకరిస్తున్నావంటూ దుర్భాషలాడి, కొట్టి ఐదుగురు సిబ్బందితో డేనియేల్‌కు శిరోముండనం చేయించాడు.