రాష్ట్రీయం

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తాత్కాలికంగా ప్లాట్‌ఫాం టికెట్ ధర రూ.20కి పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 20: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తాత్కాలికంగా ప్లాట్‌ఫాం టికెట్ ధర రూ.20కి పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రానున్న దసరా పండుగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీకన్నా, వారి వెంటవచ్చి వెళ్లే వారి రద్దీ ఎక్కువ ఉంటున్నందున ఆ రద్దీని నియంత్రించేందుకు ప్లాట్‌ఫాం టికెట్ ధర పెంచుతున్నటు తెలిపింది. ఈ నెల 21 నుంచి అక్టోబర్ 3 వరకు ప్రస్తుతం ఉన్న టికెట్ ధర రూ.10 నుంచి రూ.20కి పెంచి వసూలు చేస్తారని తెలిపింది. రైల్వే వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని, రైల్వేకు సహకరించాలని రైల్వే కోరింది.