రాష్ట్రీయం

రాజంపేట ఎంపీ మిధున్‌రెడ్డి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 17: రేణిగుంట విమానాశ్రయం మేనేజర్ రాజశేఖర్‌పై జరిగిన దాడి కేసులో 19మంది నిందితుల్లో ఒకరైన కడప జిల్లా రాజంపేట ఎంపీ మిధున్‌రెడ్డిని, మరో నిందితుడు బియ్యపు మధుసూధన్‌రెడ్డిని శనివారం అర్థరాత్రి చెన్నైలోని విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఆదివారం రేణిగుంట మండలంలోని గాజులమండ్యం పోలీస్టేషన్‌కు తరలించారు. అరెస్టు చూపించి శ్రీకాళహస్తిలోని ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యపరీక్షలు చేయించారు. అనంతరం న్యాయమూర్తి ఇంటివద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి వారికి 14 రోజులపాటు రిమాండ్ విధించారు. అక్కడి నుండి మిధున్‌రెడ్డి, బియ్యపు మధుసూధన్‌రెడ్డిలను నెల్లూరు సబ్‌జైలుకు తరలించారు. ఎంపీ అరెస్టు అప్రజాస్వామికమని నిరసిస్తూ వైకాపా నేతలు జిల్లావ్యాప్తంగా ఆందోళనకు దిగారు. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన జిల్లా పోలీసులు అనేకమంది వైకాపా ఎమ్మెల్యేలను, నాయకులను ఆదివారం గృహనిర్బంధం చేశారు. అయినప్పటికీ వైకాపా నేతలు జిల్లావ్యాప్తంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. ఈక్రమంలో పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకుని మిధున్‌రెడ్డిని జైలుకు తరలించిన తరువాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. జిల్లావ్యాప్తంగా సుమారు 4 వేలమంది వైకాపా నేతలను, కార్యకర్తలను అరెస్టు చేసి విడుదల చేసి ఉంటారని అంచనా. ఈ సందర్భంగా తిరుపతి వైకాపా ఎంపీ వరప్రసాద్, ఎమ్మెల్యేలు ఆర్‌కె రోజా, రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి, నారాయణస్వామి, వైకాపా రాష్ట్ర కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డిలు మాట్లాడుతూ బాబు పతనం ప్రారంభమైందన్నారు. ఒక ఎంపీని ఉగ్రవాదిని అరెస్టు చేసినట్టుగా ఎయిర్‌పోర్టులో లుక్ అవుట్ ఇచ్చి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. ఇక జిల్లాలో 144 సెక్షన్, 30 యాక్టును విధించి పోలీసులు కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. న్యాయస్థానంపై తమకు పరిపూర్ణమైన నమ్మకం ఉందని, వ్యవహారాన్ని కోర్టులో తేల్చుకుంటామన్నారు. అప్రజాస్వామికంగా వ్యవహరించిన వారందరినీ ప్రజాకోర్టులో నిలబెడతామన్నారు.

చిత్రం... ఎంపీ మిధున్‌రెడ్డికి వైద్య పరీక్షలు చేసి తరలిస్తున్న దృశ్యం