రాష్ట్రీయం

వికటించిన చుక్కల మందు .. పసికందు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, జనవరి 17: కృష్ణా జిల్లా మొవ్వ మండలం అయ్యంకి గ్రామంలో ఆదివారం పోలియో చుక్కల మందు వికటించి మూడు రోజుల పసికందు మృతి చెందింది. పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం అయ్యంకి గ్రామంలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రం ద్వారా వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది తమ బాబుకు పోలియో చుక్కలు వేసినట్లు పసికందు తల్లిదండ్రులు తెలిపారు. ఈ నెల 15న బండ్రెడ్డి కుమారి మొవ్వ పిహెచ్‌సిలో కుమారుడికి జన్మనిచ్చింది. 16న తల్లీ బిడ్డ క్షేమంగా ఉండటంతో వైద్యపరీక్షలు నిర్వహించిన డా. శొంఠి శివరామకృష్ణ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆదివారం ప్రత్యేక పల్స్‌పోలియో సందర్భంగా ఉదయం 8.30కు పసికందుకు పోలియో చుక్కలు వేశారు. చుక్కల మందు వేసిన గంట వరకు ఆరోగ్యంగా ఉన్న పసికందు ముక్కునుండి రక్తం కారటంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు మొవ్వ పిహెచ్‌సికి తరలించారు. వైద్యులు డా. శివరామకృష్ణ పరీక్షించి అత్యవసర వైద్య చికిత్స కోసం ఆక్సిజన్ పెట్టి 108 అంబులెన్స్ ద్వారా చిన్నారిని మచిలీపట్నం తరలించారు. అక్కడికి చేరేటప్పటికే పసికందు మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. దీంతో తల్లిదండ్రులు గొల్లుమన్నారు. దీనిపై డిఎంహెచ్‌ఓను వివరణ కోరగా పోలియో చుక్కలు వికటించే అవకాశం లేదన్నారు. అదే సీసాలోని మందును ఇతర చిన్నారులకు వేశామని, వారంతా ఆరోగ్యంగా ఉన్నట్లు డా. శివరామకృష్ణ తెలిపారన్నారు. ఈ పసికందు అనారోగ్యానికి గురై ఉండవచ్చని, అందువల్ల పోలియో చుక్కలు వేయగానే రక్తం కారటంతో పరీక్షించేందుకు మచిలీపట్నం తీసుకొచ్చారని, అప్పటికే మృతి చెందినట్లు డిఎంహెచ్‌ఓ తెలిపారు. జెడి వాణిశ్రీ వెంటనే మొవ్వ పిహెచ్‌సిని సందర్శించి సిబ్బందిని, డా. శివరామకృష్ణ, ఆరోగ్య శాఖ కార్యకర్తలను పిలిచి విచారణ చేపట్టారు.