రాష్ట్రీయం

పుష్కర్ ఘాట్ తొక్కిసలాటపై నేటినుంచి విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 17: గోదావరి పుష్కరాల ప్రారంభం రోజు జూలై 14న రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 29మంది మృతి చెందిన సంఘటనపై సోమవారం నుండి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు ఏకసభ్య కమిషన్ న్యాయ విచారణ ప్రా రంభం కానుంది. తొక్కిసలాటలో అక్కడికక్కడే 27మంది మృతి చెందగా, చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందిన సంగతి విదితమే. ఈ సంఘటనపై విచారణ జరిపేందుకు రాష్ట్రప్రభుత్వం జస్టిస్ సివై సోమయాజులు ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. జస్టిస్ సోమయాజులు కమిషన్ ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఉదయం 10.30గం టల నుండి విచారణ నిర్వహించేందుకు అతిథిగృహం సమావేశపు హాలులో ఏ ర్పాట్లు చేశారు. తొక్కిసలాటకు గల కారణాలు, పుష్కరాల భక్తుల భద్రతకు అవసరమైన ఏర్పాట్లు చేయటంలో అధికార యంత్రాంగం వ్యవహరించిన తీరు తదితర అంశాలపై విచారణ జరగనుంది. ఈ సంఘటనకు గల కారణాలపై రాతపూరకంగా ఇప్పటికే కొంతమంది కమిషన్‌కు తమ వాదనలను సమర్పించారు. ఇలా రాతపూరకంగా తమ వాదనను సమర్పించిన వారు విచారణకు రావల్సిందిగా కమిషన్ నుండి నోటీసులు అందాయి. ఆర్ అండ్ బి అతిథిగృహం సమావేశపు హాలులో కమిషన్ ముందు సాక్ష్యం చెప్పేందుకు వచ్చే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఆ రోజు ఏం జరిగింది?
పుష్కరాలు ప్రారంభం రోజు తెల్లవారుజామున నుండి భక్తులను పుష్కరఘాట్ లోపలకు వెళ్లకుండా పోలీసులు గేట్లు మూసివేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కరఘాట్‌లోనే గోదావరి పుష్కరాలను ప్రారంభించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేయటంతో సాధారణ భక్తులను తెల్లవారుజాము నుండే పోలీసులు పుష్కరఘాట్‌లోకి వెళ్లనీయలేదు. గేట్లను మూసివేశారు. దాంతో తెల్లవారుజాము నుండి అధిక సంఖ్యలో రావటం మొదలైన భక్తులు ఒకటవ నంబరు గేటు వద్దే క్యూలైన్‌లో ఉండిపోయారు. పాత రైలు వంతెన, బౌస్ట్రింగ్ రైలు వంతెనకు మధ్యలో పుష్కరఘాట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ప్రాంతానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా పుష్కర స్నానంచేసేందుకు ఉదయం సుమారు 6గంటలకు చేరుకున్నారు. తొలి పుష్కరస్నానం కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఇదే ఘాట్‌లో ఆచరించిన అనంతరం ముఖ్యమంత్రి కూడా కుటుంబ సమేతంగా పుణ్యస్నానంచేసి, పితృదేవతలకు పిండ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమాలన్నీ పూర్తిచేసుకుని పుష్కరఘాట్ నుండి వెళ్లిన వెంటనే సుమారు 8.30గంటలకు పుష్కరఘాట్ ఒకటో నంబరు గేటును తెరిచారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగి 27మం ది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. భక్తుల రద్దీని చిత్రీకరించటం కోసం ఉద్దేశపూరకంగానే ఇలా గేట్లు మూసి ఉంచారని, సిఎం పుణ్యస్నానం చేయటం కోసమే మూడు గంటల పాటు ఇలా పుష్కరఘాట్ గేట్లు మూసివేసారని రకరకాల ఆరోపణలున్నాయి. పరిస్థితి అదుపు తప్పేలా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ పోలీసులంతా సిఎంని చూసుకోవటంతోనే సరిపెట్టుకున్నారన్న ఆరోపణలున్నాయి. సిఎం చంద్రబాబు విఐపి ఘాట్ లో కాకుండా సామాన్య భక్తులు పుణ్యస్నానం చేసే పుష్కరఘాట్‌లో స్నానం చేయటం వల్లే ఈ సంఘటన జరిగిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.