రాష్ట్రీయం

భారీ వర్షాలతో రైల్వే ట్రాక్‌కు కోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంతకల్లు, అక్టోబర్ 12: అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో భారీ వర్షాలకు గురువారం రైల్వేట్రాక్ కోతకు గురైంది. దీంతో ఈ మార్గంలో పలు రైళ్లు రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. వివరాలు ఇలా ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా బుధవారం రాత్రి అనంతపురం జిల్లా పామిడి-కల్లూరు మధ్య గల పెన్నా నది పొంగిపొర్లింది. దీంతో గుంతకల్లు- కల్లూరు మార్గంలో పెన్నానదిపై నిర్మించిన వంతెన 45వ పిల్లర్ వద్ద 241 కిలోమీటర్ సమీపంలో ట్రాక్ కోతకు గురైంది. సుమారు కిలోమీటరు మేర మట్టి కొట్టుకుపోయింది. దీంతో ఈ మార్గంలో పలు ప్రధాన నగరాలకు వెళ్లాల్సిన రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. 57427 గుంతకల్లు రాయచూరు ప్యాసింజర్, 13వ తేదీ 57427 రాయచూర్- గుంతకల్లు ప్యాసింజర్ రైలు రద్దయింది. 57438 హిందూపూర్- గుంతకల్లు ప్యాసింజర్ రైలును పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపారు. 15016 యశ్వంత్‌పూర్- గోరఖ్‌పూర్ వయా పాకాల, తిరుపతి, గూడూరు, బాలార్‌షా మీదుగా మళ్లిస్తున్నట్లు తెలిపారు. 12975 మైసూర్- జైపూర్ జోలార్‌పేట్, రాయచూరు, గూడురు, విజయవాడ, బాలార్ష మీదుగా మళ్లిస్తున్నట్లు తెలిపారు.