రాష్ట్రీయం

లోపం మనవాళ్లదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 26: అమెరికా చదువులకు పెద్ద సంఖ్యలో వెళ్తున్న తెలుగు రాష్ట్రాల విద్యార్ధుల్లో కొంత మంది తిరిగి వెనక్కు రావడం అందరినీ కలవరపరుస్తోంది. అసలు అమెరికాలో ఏం జరుగుతోంది ? మన విద్యార్ధులు ఎందుకు వెనక్కు వస్తున్నారు? ఎఫ్-1 వీసా పొందిన వారు కూడా ఇబ్బందులు ఎందుకు ఎదుర్కొంటున్నారో ఎవరికీ అంతుచిక్కడం లేదు. దీనిపై టెక్సాస్‌లో చాలాకాలంగా ఇమిగ్రేషన్ వ్యవహారాల్లో ఆరితేరిన డాక్టర్ తోటకూర ప్రసాద్ తెలుగు విద్యార్ధులకు అనేక సూచనలు చేశారు. అమెరికా వెళ్తున్న తెలుగు విద్యార్ధులు అందుకు తగ్గట్టు సన్నద్ధం కావడం లేదని, లోపం మనవారిలోనే ఉందని ఆయన పేర్కొన్నారు.
* అమెరికా వర్శిటీలను ఎంచుకోవడం ఎలా?
కొన్ని సందర్భాల్లో యూనివర్శిటీలకు గుర్తింపున్నా, కొన్ని కోర్సులకు గుర్తింపు ఉండకపోవచ్చు. ఎంచుకునే యూనివర్ళిటీ, కోర్సు గుర్తింపు పొందినవో లేదో చూసుకోవాలి.
* అమెరికాలో డిపార్టుమెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ గుర్తించిన ఏజన్సీలున్నాయా?
ఉన్నాయి, అక్రిడిటేషన్ ఏజన్సీ, అక్రిడిటేషన్ కమిషన్ ఆఫ్ కెరీర్ స్కూల్స్ అండ్ కాలేజీ, అక్రిడిటేషన్ కౌన్సిల్ ఆఫ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, అక్రిడిటేషన్ కౌన్సిల్ ఫర్ ఇండిపెండెంట్ కాలేజీస్ అండ్ స్కూల్స్, కౌన్సిల్ ఆఫ్ ఆక్యుపేషనల్ ఎడ్యుకేషన్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అక్రిడిటేటింగ్ కమిషన్, మిడిల్ స్టేట్స్ కమిషన్ ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్, మిడిల్ స్టేట్స్ కమిషన్ ఆన్ సెకండరీ ఎడ్యుకేషన్ పనిచేస్తున్నాయి, ప్రాంతాల వారీ చూసుకుంటే న్యూ ఇంగ్లాండ్ అసోసియేషన్ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజీస్, న్యూయార్క్ స్టేట్ బోర్డు ఆఫ్ రీజెంట్స్ అండ్ ద కమిషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, నార్త్ సెంట్రల్ అసోసియేషన్ ఆఫ్ కాలేజీస్ ఇలా పలు సంస్థలు పనిచేస్తున్నాయి.
* గుర్తింపు పొందిన వర్శిటీల వివరాలు?
అమెరికా డిపార్టుమెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ తమ గుర్తింపు పొందిన సంస్థల వివరాలను ఎప్పటికపుడు విడుదల చేస్తుంది.
* యూనివర్శిటీల్లో ప్రవేశానికి కావల్సిన అర్హతలు?
డిగ్రీతో పాటు టోఫెల్, జిఆర్‌ఇ, జిమ్యాట్ స్కోర్ ఉండాలి. అప్పటికే పూర్తి చేసిన డిగ్రీని ఏదైనా ఒక ఎడ్యుకేషనల్ క్రెడిన్షియల్ ఎవాల్యూయేషన్ ఏజన్సీకి పంపించి అది యుఎస్‌ఎలో ఏ డిగ్రీతో సమానమైనదో సరిచూసుకోవాలి. ఇందుకోసం ఇ వాల్యూట్, ఎడ్యుకేషనల్ ఇంటర్నేషనల్, రికార్డ్సు ఇవాల్యూయేషన్ సర్వీసెస్, ఫారిన్ అకడమిక్ క్రెడిన్షియల్స్ సర్వీసెస్ పేరిట చాలా ఏజన్సీలు యుఎస్‌ఎలో పనిచేస్తున్నాయి.
* ఆర్ధిక వనరుల సంగతి?
అమెరికాలోని కొన్ని ప్రైవేటు సంస్థలు, నాన్ ప్రాఫిట్ సంస్థలు అర్హత ఉన్న విద్యార్ధులకు కొంతమేరకు ఆర్ధికంగా సాయం చేయవచ్చు. యూనివర్శిటీలు అంతర్జాతీయ విద్యార్ధులకు చేయూతను అందించేందుకు కూడా సిద్ధంగా ఉంటాయి.
* స్టూడెంట్ వీసా అంటే?
ఎఫ్-1 స్టూడెంట్ వీసా అంటే అమెరికాలో విద్యాభ్యాసానికి ఇచ్చేది. జె-1 వీసా అంటే యుఎస్‌లో ఎక్స్చేంజి విజిటర్ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు ఇచ్చేది. ఎం-1 వీసా అంటే వృత్తి విద్యా కోర్సులను అభ్యసించేందుకు ఇచ్చే వీసా. అభ్యర్ధులు తమ దరఖాస్తులను పంపించిన తర్వాత వాటిని యూనివర్శిటీ సమీక్షించి విద్యార్ధి ఏ వీసాకు అర్హులో తేలుస్తుంది. అనంతరం వారికి ఐ-20 ఫారం జారీ చేస్తుంది. ఐ-20లో పేర్కొన్న విధంగా పేరు, పుట్టిన తేదీ తదితర వివరాలు పాస్‌పోర్టులో వివరాలు ఒకేలా ఉండాలి. ఆ తర్వాత ఐ-901 ఫీజు చెల్లించాలి. రసీదు పొందిన తర్వాత ఎఫ్-1 స్టూడెంట్ వీసాకు యుఎస్ కాన్సలేట్ లేదా ఎంబసీకి వెళ్లాలి. గుర్తింపు పొందిన వర్శిటీలు తాము విదేశీ విద్యార్ధులను చేర్చుకుంటున్నట్టు పేర్కొంటూ ఐ -17 ఫారం ద్వారా ముందుగానే యుఎస్ హోం ల్యాండ్ సెక్యూరిటీకి సమాచారం అందిస్తాయి. అభ్యర్ధులు తాము చేరబోయే వర్శిటీ ఐ-17 ఫారం సమర్పించిందా లేదా అన్నది ధ్రువీకరించుకోవాలి.
* వీసాకు ఏ డాక్యుమెంట్లు కావాలి?
నివసించే కాలం కంటే కనీసం అదనంగా ఆరు నెలల కాలపరిమితి ఉన్న పాస్‌పోర్టు, నాన్ ఇమిగ్రేంట్ వీసా అప్లికేషన్ ఫారం, డిఎస్ -160 ద్వారా ఆన్‌లైన్‌లో పూర్తి చేయాలి. అప్లికేషన్ ఫీజు చెల్లింపు రసీదు, ఫోటో, సర్ట్ఫికేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఫర్ ఎఫ్-1 స్టూడెంట్ వీసా, వివిధ విద్యాసంస్థల ద్వారా పొందిన డిగ్రీలు, మార్కుల జాబితాలు సర్ట్ఫికేట్లు దగ్గర ఉంచుకోవాలి, టోఫెల్, జిఆర్‌ఇ, జి మ్యాట్ స్కోర్ కార్డులను ఇంటర్వ్యూకు దగ్గర ఉంచుకోవాలి, అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం ముగిసిన తర్వాత తప్పనిసరిగా స్వదేశం తిరిగి వెళ్లాల్సిన అవసరం ఉందని రుజువు చేసే పత్రాలు ఉండాలి.
* ప్రయాణ జాగ్రత్తలు
పాస్‌పోర్టు, ఎఫ్-1 స్టూడెంట్ వీసా, వీసాపై చేరబోయే యూనివర్శిటీ పేరు, వీసా క్లాసిఫికేషన్ సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. స్వదేశంలో ఎఫ్-1 వీసా పొందిన సమయంలో కాన్సులేట్ అధికారి ఇచ్చిన సీల్డు కవరును తెరవకుండా అమెరికా ఎయిర్‌పోర్టులో సంబంధిత ఇమిగ్రేషన్ అధికారికి అందించాలి. అలాగే ఎఫ్-1 వీసా, ఫారం ఐ-20 లేదా డిఎస్ 2019, ఫారం ఐ-797 ఫీజు చెల్లించిన రసీదు సిద్ధంగా ఉంచుకోవాలి. ఎఫ్-1 స్టూడెంట్ వీసా ఉన్న విద్యార్ధులు ఎవరూ యూనివర్శిటీ పరిధి దాటి ఉద్యోగం చేయకూడదు. యూనివర్శిటీ ప్రాంగణంలో ఉద్యోగం చేసే వెసులుబాటు ఉంటే వారానికి 20 గంటలు మించి ఉద్యోగం చేయరాదు. ఎఫ్-1 వీసా విద్యార్ధులు అమెరికా దేశంలో తమ కోర్సు పూర్తిఅయిన తర్వాత 60 రోజులకు మించి ఉండరాదు. అయితే సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, మేనేజిమెంట్ విద్యార్ధులు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఒపిటి) కోసం మరో 12 నెలలు ఉండొచ్చు. తర్వాత అదనంగా 17 నెలలు ఉండటానికి అర్హులు అవుతారు. ఎఫ్-1 స్టూడెంట్ వీసా విద్యార్ధులు తమకు జారీ చేసిన ఐ-20 ఫారంలోని గడువు ముగిసేలోగానే తమ చదువు పూర్తి చేయాలి.
* ఎయిర్ పోర్టులో పరిస్థితి ఏమిటి?
అమెరికాలో దిగిన తర్వాత ఎయిర్‌పోర్టులో ఇమిగ్రేషన్ అధికారులు అకడమిక్ ప్లాన్స్, ఆర్ధిక వనరులకు సంబంధించి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎలాంటి తడబాటు లేకుండా సరైన సమాధానాలు ఇవ్వాలి. మీరు మీ విద్యాభ్యాస కాలంలో ఆర్ధిక వనరులకు యూనివర్శిటీ పరిధి దాటి ఎటువంటి ఉద్యోగం చేయబోమని కచ్చితమైన సమాధానం ఇవ్వాలి.