రాష్ట్రీయం

చావుకేకలు ఆపుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై తెలంగాణ ప్రభుత్వం మేల్కొంది. కార్పొరేట్ కాలేజీలు, స్కూళ్లు, ఇంటర్నేషనల్ స్కూళ్లలో విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెరిగి కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ కాలేజీలు, స్కూళ్లలో ఆత్మహత్యల నివారణకు తీసుకోవల్సిన చర్యలపై విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ రంజన్ ఆచార్య, డైరెక్టర్ కిషన్, ఇంటర్ బోర్డు కమిషనర్ అశోక్, ఇతర విద్యాశాఖాధికారులతో కడియం శ్రీహరి సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. కార్పొరేట్ కాలేజీలు, స్కూళ్ల యాజమాన్యాలు, తల్లిదండ్రుల సంఘాలతో నేడు సంయుక్త సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. సమావేశం అనంతరం ఆత్మహత్యల నివారణకు, పిల్లలపై మానసిక ఒత్తిడి పెరగకుండా ఉండేందుకు ఇలాంటివి పునరావృత్తం కాకుండా ఉండేలా మార్గదర్శకాలను విడుదల చేయాలన్నారు. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా, స్వేచ్ఛాయుత వాతావరణంలో పాఠాలు బోధించే విధంగా కాలేజీలు, స్కూళ్ల విధానం ఉండాలన్నారు. ఇందుకు సంబంధించి కాలేజీలు, స్కూళ్లను తనిఖీ చేసి అక్కడున్న విద్యావిధానాలను, పనితీరును అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. అంతర్జాతీయ పాఠశాలలు, కార్పొరేట్ కాలేజీలు, పాఠశాలలు ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనలకు లోబడి పనిచేసేలా మార్గదర్శకాలు ఇవ్వాలన్నారు. కాలేజీ యాజమాన్యాలు ఈ మార్గదర్శకాలను అమలుచేయకుంటే గుర్తింపును రద్దు చేయాలని ఆదేశించారు.
తల్లిదండ్రులకు విజ్ఞప్తి
తల్లిదండ్రులు తమ పిల్లల సామర్థ్యాన్ని గుర్తించి తగిన కోర్సులు, కాలేజీల్లోనే చేర్పించాలని ఉప ముఖ్యమంత్రి తల్లిదండ్రులను కోరారు. పిల్లలకు
ఇష్టమైన కోర్సులు, కాలేజీల్లో చదువుకునే వెసులుబాటు కల్పించాలని, కార్పొరేట్ కాలేజీల్లో చదివించడం స్టేటస్ సింబల్‌గా భావించవద్దని సూచించారు. కార్పొరేట్ కాలేజీలు, స్కూళ్లు, అంతర్జాతీయ స్కూళ్లు కూడా విద్యార్ధుల వికాసం కోసం విద్యను అందించాలన్నారు. నిబంధనలకు లోబడి పనిచేయాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే గుర్తింపు కోల్పోయే ప్రమాదాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. పిల్లలకు తల్లిదండ్రులను కలుసుకునే స్వేచ్ఛ కల్పించాలని, అవసరమైతే పిల్లలను ఇంటికి వెళ్లేందుకు అనుమతించాలన్నారు. సెలవుల్లో కూడా పిల్లలు ఇళ్లకు వెళ్లనివ్వకుండా ర్యాంకుల కోసం వారిపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు, విద్యావిధానాలు మంచివి కావన్నారు.
కౌనె్సలింగ్ సెంటర్లు
అన్ని కాలేజీల్లో కౌనె్సలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి కోరారు. ఈ సెంటర్లలో విద్యార్థులకు ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం పెంపొందించేలా కౌనె్సలింగ్ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కౌనె్సలింగ్ సెంటర్లకు తల్లిదండ్రులను కూడా అనుతమించి వారి సందేహాలు, అనుమానాలను నివృత్తి చేయాలన్నారు. భయాలను దూరం చేసే విధంగా కాలేజీల్లో విద్యావిధానాల గురించి, పిల్లల తీరు గురించి వివరించి చెప్పాలని సూచించారు. తల్లిదండ్రులపరంగా తీసుకోవల్సిన జాగ్రత్తలను చెప్పాలని అన్నారు.
ఆత్మహత్యలకు పాల్పడవద్దు
జీవితం చాలా అమూల్యమైనదని, ఏ కారణం వల్ల కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దని, అలాంటి క్షణికావేశానికి విద్యార్థులు ఎలాంటి పరిస్థితుల్లోనూ లోను కావద్దని కడియం శ్రీహరి సూచించారు. విద్యార్థులకు అండగా ఈ ప్రభుత్వం ఉందని, ఏదైనా సమస్య ఉంటే వెంటనే తల్లిదండ్రుల దృష్టికి లేదా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ప్రభుత్వపరంగా తప్పకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.