రాష్ట్రీయం

శ్రీశైలానికి తగ్గుతున్న వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, అక్టోబర్ 18: శ్రీశైలం జలాశయానికి వరద క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దీంతో నాలుగు గేట్ల ద్వారా దిగువ నాగార్జునసాగర్‌కు నీరు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా బుధవారం సాయంత్రానికి 883.80 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215 టిఎంసిలు
కాగా ప్రస్తుతం 208.72 టిఎంసిల నీరు నిల్వ ఉంది. జూరాల ప్రాజెక్టు నుంచి 1,53,176 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జలాశయం నుంచి 1,98,000 క్యూసెక్కుల నీరు నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. అదే విధంగా పోతిరెడ్డి హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 12 వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా 1,688 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1,600 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. మొదటి పవర్‌హౌస్‌లో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 30,238 క్యూసెక్కులు, రెండో పవర్ హౌస్‌లో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 42,378 క్యూసెక్కులు కలిపి మొత్తం 72,616 క్యూసెక్కుల నీరు సాగర్‌కు విడుదల చేస్తున్నారు. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు ఆరు గేట్లు తెరిచి ఉంచారు.
అయితే ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టడంతో ఆ తరువాత రెండు గేట్లు మూసివేశారు. ప్రస్తుతం నాలుగు గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 1,10,096 క్యూసెక్కుల నీరు సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లోను బట్టి గేట్లు మూసివేసే అవకాశాలు ఉన్నాయి.